కొనసాగుతున్న కర్ణాటక బంద్‌.. | Karnataka Bandh Today Security Tightened | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కర్ణాటక బంద్‌..

Published Sat, Mar 22 2025 9:09 AM | Last Updated on Sat, Mar 22 2025 11:10 AM

Karnataka Bandh Today Security Tightened

బెంగళూరు: కర్ణాటకలో బంద్‌ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. బంద్‌ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలు, ప్రైవేటు సర్వీసులు యథాతథంగా నడుస్తున్నాయి. దీంతో, పాక్షికంగా బంద్‌ ప్రభావం కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు బంద్‌ కొనసాగనుంది.

కేఎస్‌ ఆర్టీసీ బస్‌ కండక్టర్‌పై మరాఠీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎంఈఎస్‌ను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కర్ణాటక బంద్‌కు వాటాళ్‌ నాగరాజ్‌ నేతృత్వంలో కన్నడ ఒక్కూట్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, బంద్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు. ఓలా, ఉబర్‌, డ్రైవర్‌ల నుంచి కొన్ని ఆటో సంఘాలు బంద్‌కు మద్దతు వ్యక్తం చేశాయి. హోటల్‌ యజమానుల సంఘం నైతికంగా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రవీణ్‌ కుమార్‌ శెట్టి వర్గం బంద్‌కు మద్దతు ప్రకటించింది.

ఇక, అత్యవసర సేవలైన పాలు, ఔషధం, దినపత్రిక, కూరగాయల సరఫరా ఎప్పటిలాగే ఉంటాయి. వాటాళ్‌ నాగరాజ్‌ శుక్రవారం నగర పోలీస్‌ కమిషనర్‌ దయానందను భేటీ చేసి బంద్‌కు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. అయితే సానుకూల స్పందన రాలేదు. అయినా బంద్‌ చేసి తీరుతానని వాటాళ్‌ తెలిపారు. కర్ణాటక బంద్‌కు చలనచిత్ర వాణిజ్య మండలి మద్దతును ప్రకటించింది. అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ బంద్‌కు మద్దతు ఉంటుందని, అయితే సినిమా షూటింగ్‌ యధా ప్రకారంగా జరుగుతాయన్నారు. థియేటర్ల యజమానులు బంద్‌కు మద్దతు ఇచ్చారు. ఉదయం ప్రదర్శన బంద్‌ చేస్తామని, మధ్యాహ్నం తరువాత సినిమాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

భారీ భద్రత..
బంద్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా శనివారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాఠశాల–కాలేజీలకు సెలవు ఇచ్చే విషయం ఎలాంటి తీర్మానం తీసుకోలేదని మంత్రి మధు బంగారప్ప తెలిపారు. రవాణా సదుపాయం లేకపోతే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పరీక్షలు ప్రారంభమైన విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement