Karnataka bandh
-
కర్ణాటక బంద్ ఎఫెక్ట్: స్కూల్స్ మూసివేత.. 44 విమానాలు రద్దు
సాక్షి, చెన్నై: కావేరి జలాల సమస్య కారణంగా కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం బంద్ కొనసాగుతోది. పొరుగున్న ఉన్న తమిళనాడుకు కావేరి నీటి విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ (CWMA) కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కూట రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు దాదాపు 1900 కన్నడ సంఘాలు మద్దతు తెలిపాయి. వీటిలో హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు విద్యాసంఘాలు ఉన్నాయి. బంద్‌లో భాగంగా నిరసనల్లో పాల్గొన్న వివిధ సంఘాలకు చెందిన 60 మంది ఆందోళనకారులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని బెంగళూరు రూరల్ ఏఎస్పీ మల్లికారంరోజున బాలదండి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్ణాటక బంద్ ఎఫెక్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై పడింది. బంద్ కారణంగా రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో శుక్రవారం ప్రయాణించాల్సిన ఏకంగా 44 విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో 22 విమానాలు బెంగుళూరులో ల్యాండ్ అయ్యేవి కాగా మరో 22 విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్ కావాల్సినవి ఉన్నాయి. ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించడం ద్వారా వారు తమ టికెట్లను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ ప్రభావం కొనసాగనుంది. బెంగళూరు నగరంలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ప్రజలు గుంపులుగా బయటకు వచ్చి ర్యాలీలు, నిరసనలు చేపట్టకూడదని, అయిదుగురు కంటే ఎక్కువ మంది సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. 1,900కు పైగా సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బెంగళూరుతో సహా రాష్ట్రంలో కిరాణా దుకాణాలు, ఇతర షాప్‌లను మూసేశారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. Karnataka Bandh: Section 144 Imposed in Mandya District; Schools, Colleges Closed#BNN #Newsupdate #Dailynews #Breakingnews #India #KarnatakaBandh #CauveryIssue #Bengaluru #Cauveryrow #Karnataka #WATCH pic.twitter.com/XxoBNFwLni — Rafia Tasleem (@rafia_tasleem) September 29, 2023 బెంగళూరులో మెట్రో సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. మెట్రో స్టేషన్ల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక బంద్ దృష్ట్యా బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ దయానంద కేఏ సెలవు ప్రకటించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. కాగా బంద్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర రవాణ బస్సులు, బీఎంటీసీ బస్సులు నడవనున్నాయి. అయితే తమిళనాడు వైపు వెళ్లే బస్సులు నడవకపోవచ్చని, పరిస్థితిని బట్టి మారుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. బెంగళూరులోని ప్రధాన రహదారులపై, ముఖ్యంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పాడే అవకాశం ఉందన్నారు. Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM — Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023 ఓలా ఉబర్ వంట క్యాబ్ యాజమాన్యాలు బంద్‌కు మద్దతునిచ్చాయి. ర్యాలీలో పాల్గొనాలని భావించాయి. ఆటో, రక్షా సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. 32 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కర్ణాటక బంద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కర్ణాటక హోటల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని కర్ణాటక ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
రైతన్న యుద్ధభేరి.. ఏమైనా జరగొచ్చు
సాక్షి, బెంగళూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రాష్ట్రంలో వివిధ రైతు సంఘాలు, వివిధ సంఘాలు సోమవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. బెంగళూరులో భద్రతను పటిష్టం చేశారు. డీజీపీ ప్రవీణ్ సూద్, అన్నిచోట్ల ఐజీపీ, నగర పోలీసు కమిషనర్, అదనపు పోలీసు కమిషనర్, డీసీపీలకు తగిన బందోబస్త్ చేపట్టాలని ఆదేశించారు. నగరంలో తుమకూరు రోడ్డు, మాగడి రోడ్డు, మైసూరు రోడ్డు, హొసూరు రోడ్డు, దేవనహళ్లి రోడ్లలో మోహరించారు. ముందుగా మైసూరు బ్యాంకు సర్కిల్లో రైతుసంఘాల కార్యకర్తలు ధర్నా చేస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరతారు. ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు జరుగుతోంది. సిటీ, ఆర్టీసీ బస్సులు, రైళ్ల సంచారం యథావిధిగా ఉంటుంది. దుకాణాలు, మాల్స్ తదితర వాణిజ్య కేంద్రాలను మూసివేసే అవకాశముంది. (వ్యవసాయ బిల్లులపై నిరసనలు) ఏమైనా జరగవచ్చు: కరవే సోమవారం కర్ణాటక బంద్ ఎక్కడికైనా దారితీయవచ్చని కరవే అధ్యక్షుడు టీ.ఏ.నారాయణగౌడ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సోమవారం బంద్‌కు కరవే పూర్తి మద్దతునిస్తున్నదని, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరవే బంద్‌లో పాల్గొంటుందని తెలిపారు. సోమవారం బంద్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురుకు పట్టాలన్నారు. ఏపీఎంసీ, భూ సవరణ, గిట్టుబాటు ధరల చట్టాల ద్వారా రైతులకు మరణశాసనం రాస్తున్నారని దుయ్యబట్టారు. బస్సులు యథాతథం శివాజీనగర: రైతుల బంద్‌పై ప్రజలకు చింత వద్దు, ఈ బంద్‌కు ప్రభుత్వ మద్దతు లేదు, ఎప్పటిలాగే బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్సులు సంచరిస్తాయని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. అన్ని రకాల దుకాణాలు తెరుచుకుంటాయన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ధర్నా చేపట్టాలని, అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కన్నడ పోరాట నాయకుడు వాటాళ్ నాగరాజ్, ఎట్టి పరిస్థితిల్లోనూ బస్సులు రోడ్లపైకి రాకూడదని అన్నారు. రైతు బంద్‌కు మద్దతు: డీకేశి బనశంకరి: రైతుల పోరాటానికి పూర్తి మద్దతిస్తున్నట్లు కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు జాతీయస్థాయిలో తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ సీఎం యడియూరప్ప రైతు వ్యతిరేకి అని విమర్శించారు. -
కర్ణాటక బంద్: ఆంధ్రా బస్సుపై రాళ్ల దాడి
బెంగళూరు : ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ కన్నడ సంఘాలు ఇవాళ రేపు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ఇప్పటికే అన్ని సంఘాలు (ఆటో, క్యాబ్, రైతు, కార్మిక) తమ మద్దతును ప్రకటించడంతో రాష్ట్ర బంద్ ఉద్రిక్తంగా మారింది. గురువారం ఉదయం తిరుపతి నుంచి మంగళూరు వెళ్తున్న బస్సుపై ఫరంగిపెటె ప్రాంతంలో కొందరు నిరసన కారులు రాళ్ల దాడి చేశారు. సరోజినీ బిందురావ్ నివేదికను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన సంఘాల ప్రతినిధులు రేపు ముఖ్యమంత్రి యడియూరప్పకు నివేదికను సమర్పించనున్నారు. అయితే ప్రభుత్వ, స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడుస్తాయని, ఎటువంటి సెలవు లేదని విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. బంద్‌కు పిలుపునిచ్చిన సంస్థలు శాంతియుతంగా నిరసనలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. Mangaluru: Stones pelted on a Tirupati-Mangaluru bus in Farangipet. Several pro-Kannada groups have called for Karnataka bandh today demanding implementation of Sarojini Mahishi report which recommended certain percentage of jobs to Kannadigas in private&public sector companies pic.twitter.com/mPJXUXJTR5 — ANI (@ANI) February 13, 2020 మరోవైపు కర్ణాటక సీఎం యడ్యురప్ప ప్రజలకు నిరసనకారులు ఎలాంటి అసౌకర్యం కలిగించరాదని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం కన్నడిగులకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఆందోళన కారులు తమతో మాట్లాడటానికి అనుకూలంగా ఉంటే తమ ప్రభుత్వం వారితో చర్చించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. సరోజినీ మహిషి నివేదికను అమలు చేయడానికి తాము ఇప్పటికే సాధ్యమైనవన్నీ చేశామని, ఇంకా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా 1984లో కర్ణాటక ప్రభుత్వం కేంద్ర మాజీ మంత్రి సరోజినీ బిందురావ్ మహిషి నేత్రుత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల అనంతరం 1986లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించింది. నివేదికలో 56 సిఫారసులను పేర్కొన్న కమిటీ.. కన్నడిగులకు అన్ని సెక్టార్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని సూచించింది. -
బంద్ రోజే ఎక్కువ ప్రమాదాలట!
బెంగళూరు : మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం (జనవరి 25) కర్ణాటక వ్యాప్తంగా బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. దుకాణలు, షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు అన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. అయితే ఈ బంద్ రోజే, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్టు తెలిసింది. రాష్ట్రీయ అంబులెన్స్ సర్వీసు 108 ఆరోగ్య కవచ జీవీకే ఈఎంఆర్ఐ విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. తాము గురువారం రోజు 340 రోడ్డు ప్రమాద కాల్స్‌ను అటెండ్ చేశామని, ఇది 20.56 శాతం ఎక్కువని అంబులెన్స్ సర్వీసు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా రోజుకు 282 కేసులే వస్తాయన్నారు. బెంగళూరు సిటీలో కూడా కేసులు 12 శాతం పెరిగి 75 నమోదయ్యాయని పేర్కొంది. ఈ కాల్స్‌ను అర్థరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. బంద్ రోజు ప్రజారవాణా వ్యవస్థ స్తంభించడంతో, ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారని, భారీ ట్రాఫిక్ లేకపోవడం వల్ల కూడా హైస్పీడులో వాహనాలను దూసుకుపోయాయని పేర్కొన్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయన్నారు. ఈ ప్రమాదాల్లో ప్రజలకు ఎలాంటి ప్రాణ ముప్పు కలుగలేదన్నారు. అన్ని కేసుల్లో ప్రమాద బాధితులు, ఆసుపత్రులకు దగ్గరిలో వారనే తెలిపారు. బంద్ వల్ల కేవలం నగదు వృథా అవడమే కాకుండా.. ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయన్నారు. రోడ్డుపై తక్కువగా వాహనాలు తిరిగే రోజుల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ట్రాఫిక్ నిపుణులుఎంఎన్ శ్రీహరి తెలిపారు. నిర్లక్ష్యం, అజాగ్రత్తపరమైన డ్రైవింగ్, త్వరగా ఇంటికి వెళ్లాలనే ఆత్రుత ఇవన్నీ ప్రమాదానికి కారణమవుతాయన్నారు. -
టెక్ కంపెనీలు మూత
మహాదాయి నదీ జలాల పంపిణి విషయంలో గోవా ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా కర్ణాటక వ్యాప్తంగా చేపట్టిన బంద్, ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ బంద్‌తో బెంగళూరులోని దిగ్గజ టెక్ కంపెనీలు మూత పడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఒక్క రోజు మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. బెంగళూరు వెలుపల, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లు గురువారం సాయంత్రం ఆరున్నర వరకు మూసివేస్తున్నట్టు తెలిపింది. మైసూర్, మంగళూరులో ఉన్న క్యాంపస్‌లు కూడా మూతపడ్డాయి. ముందస్తు జాగ్రత్తగా విప్రో కూడా కర్నాటకలోని ఉద్యోగులకు గురువారం సెలవును ప్రకటించింది. నగరంలోని వైట్ ఫీల్డ్, మైనాటా టెక్ పార్కు ప్రాంతాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్, ఐబీఎం, కాగ్నిజెంట్‌లు కూడా ఒక్క రోజు తమ కార్యకలాపాలను మూసివేశాయి. ప్రజా రవాణా వ్యవస్థలు బస్సులు, టాక్సీలు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్, మార్కెట్లు అన్నీ కూడా సాయంత్రం వరకు క్లోజయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేఎస్ఆర్ టీసీ బస్సు సేవలు 95 శాతం స్థంభించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ బంకులు, బ్యాంకులు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీలు మాత్రమే తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాయి. 25న బెంగుళూరు యూనివర్సిటీల పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. గోవా- కర్నాటక మధ్య మహాదాయి నదీ జలాల పంపిణీలో వివాదంపై కూడా నేడు ఈ బంద్‌ను చేపడుతున్నారు. కన్నడ సంఘాలు ర్యాలీలు నిర్వహించి గోవా, కేంద్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశాయి. -
జూన్ 12న కర్ణాటక బంద్
బెంగళూరు: ప్రభుత్వ కర్మాగారాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, రైతుల రుణాల మాఫీ తదితర ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూన్ 12న కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం కన్నడ సంఘాల సమాఖ్య నాయకులు వాటాళ్ నాగరాజ్, సా.రా.గోవింద్, కేఆర్.కుమార్, గిరీశ్గౌడ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి రుణ మాఫీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కర్మాగారాలను ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కర్మాగారాలను మూత వేయటం ద్వారా ప్రైవేట్ వారికి ఆస్తులు విక్రయించే కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. అలాగే మేకదాటు ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని మైసూరు బ్యాంకు సర్కిల్ నుంచి రామనగర జిల్లా మేకదాటు వరకు ర్యాలీని చేపట్టనున్నట్లు చెప్పారు. కాసరగోడులో కన్నడ నేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కూడా జూన్ 8న సరిహద్దు ప్రాంతంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ అన్ని డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ జూన్ 12న కర్ణాటక బంద్‌ను చేపడుతున్నామని తెలిపారు. -
కావేరి సెగతో మారిన పెళ్లి వేదిక
తమిళనాడుకు తరలిన పెళ్లి బృందం హోసూరు: కావేరి జల వివాదం నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్న అల్లర్లతో అక్కడ జరగాల్సిన పెళ్లి తమిళనాడుకు మారింది. తిరువణ్ణామలైకు చెందిన రంజిత్(25) బెంగళూరులో భవన నిర్మాణకార్మికుడుగా పని చేస్తున్నాడు. రంజిత్‌కు తిరువణ్ణామలైకే చెందిన సౌమ్యతో బుధవారం బెంగళూరులో పెళ్లి జరిపేందుకు ముహుర్తం నిర్ణయించారు. ఆహ్వాన పత్రికలూ ముద్రించారు. పెళ్లి పీటలు సిద్ధమయ్యాయి. కానీ బెంగళూరులో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేయడం సాధ్యం కాదని గ్రహించిన పెళ్లి బృందం మొత్తం సామగ్రి సర్దుకొని తమిళనాడులోని తిరువణ్ణామలైకు తరలివెళ్లారు. వీరు బెంగళూరు నుండి అత్తిపల్లి వరకు కర్ణాటక బస్సులో అక్కడి నుండి కిలోమీటర్ దూరం పెళ్లి దుస్తులతోనే నడచి వచ్చి జూజువాడి వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సులలో తిరువణ్ణామలైకు వెళ్లారు. -
కర్ణాటకలో బంద్
-
ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలు బంద్
బెంగళూరు: కర్ణాటకలో బంద్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. శుక్రవారం బెంగళూరులో ఇన్ఫోసిస్, విప్రో సహా వందలాది ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. ప్రజా రవాణా సర్వీసులు ఆగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. లక్షలాదిమంది రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. కర్ణాటక నుంచి పొరుగురాష్ట్రం తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేయడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. దీనివల్ల తాగునీరు, సాగునీటికి సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బస్సులు, టాక్సీలు ఆగిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు. -
28న కర్ణాటక బంద్
పిలుపునిచ్చిన కర్ణాటక ప్రజాసంఘాలు డి.కె.రవి మృతి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ బెంగళూరు:ఐఏఎస్ అధికారి డి.కె.రవి ృుతిపై సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్‌తో ఈనెల 28న కర్ణాటక బంద్‌కు రాష్ట్రానికి చెందిన వివిధ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నడ చళువళి వాటాల్ పార్టీ వ్యవస్థాపకులు వాటాల్ నాగరాజ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజాయితీ గల అధికారిగా ప్రజల ప్రశంసలు అందుకున్న డి.కె.రవి ృుతిపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని అన్నారు. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌తో ఈనెల 28న బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బంద్‌తో పాటు అదే రోజున నగరంలో మౌన ర్యాలీని సైతం ప్రజా సంఘాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ బంద్‌ను తాము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగానో ఈ బంద్‌ను పాటించడం లేదని స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన ఓ అధికారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణానికి సంబంధించిన నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతోనే సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ బంద్‌ను పాటిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 28 లోపు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే బంద్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు.