ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలు బంద్ | Karnataka Bandh Shuts Down Infosys, Wipro | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలు బంద్

Published Fri, Sep 9 2016 6:37 PM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలు బంద్ - Sakshi

ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలు బంద్

బెంగళూరు: కర్ణాటకలో బంద్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. శుక్రవారం బెంగళూరులో ఇన్ఫోసిస్, విప్రో సహా వందలాది ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. ప్రజా రవాణా సర్వీసులు ఆగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. లక్షలాదిమంది రోడ‍్లపైకి వచ్చి బంద్లో పాల్గొన్నారు.

కర్ణాటక నుంచి పొరుగురాష్ట్రం తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేయడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. దీనివల్ల తాగునీరు, సాగునీటికి సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బస్సులు, టాక్సీలు ఆగిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement