పిలుపునిచ్చిన కర్ణాటక ప్రజాసంఘాలు
డి.కె.రవి మృతి కేసు దర్యాప్తు
సీబీఐకి అప్పగించాలని డిమాండ్
బెంగళూరు:ఐఏఎస్ అధికారి డి.కె.రవి ృుతిపై సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్‌తో ఈనెల 28న కర్ణాటక బంద్‌కు రాష్ట్రానికి చెందిన వివిధ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నడ చళువళి వాటాల్ పార్టీ వ్యవస్థాపకులు వాటాల్ నాగరాజ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజాయితీ గల అధికారిగా ప్రజల ప్రశంసలు అందుకున్న డి.కె.రవి ృుతిపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని అన్నారు. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌తో ఈనెల 28న బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బంద్‌తో పాటు అదే రోజున నగరంలో మౌన ర్యాలీని సైతం ప్రజా సంఘాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ బంద్‌ను తాము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగానో ఈ బంద్‌ను పాటించడం లేదని స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన ఓ అధికారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణానికి సంబంధించిన నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతోనే సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ బంద్‌ను పాటిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 28 లోపు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే బంద్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు.
28న కర్ణాటక బంద్
Published Sat, Mar 21 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM
Advertisement