కలెక్టర్ డి.కె.రవి
నాటకంతో ఆకట్టుకుంటున్న విద్యార్థులు
కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
{పజల్లో చైతన్యం తీసుకువస్తున్న వైనం
ఆకట్టుకున్న రవి పాత్రధారి సౌందర్య
కోలారు:విధుల నిర్వహణలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన కోలారు జిల్లా మాజీ కలెక్టర్ డి.కె.రవి జీవన విధానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలకు విద్యార్థులు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అ ప్పగించాలన్న నినాదాన్ని కూడా వినిపిస్తున్నారు. శుక్రవారం కోలారు జిల్లా కలెక్టరేట్ వద్ద చింతామణికి చెందిన పట్టు వ్యవసాయ విద్యార్థులు ప్రదర్శిం చిన ‘కలెక్టర్ డి.కె.రవి’ అనే వీధి నాటకం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. నాటకం పూర్తి అయ్యే వర కూ అక్కడి నుంచి ఏ ఒక్కరూ పక్కకు కూడా వెళ్లలేకపోయారు.
రవి బాల్యం మొదలు ఐఏఎస్ అధికారి అయ్యే వరకూ, అనంతరం ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను విద్యార్థులు కళ్లకు కట్టారు. ఓ పేదవాడు చదువుకునేందుకు పడుతున్న తపన చూపరులను కంటతడి పెట్టించింది. అవినీతి పరుల కుట్రలకు రవి ఎలా బలయ్యాడన్న అంశాన్ని విద్యార్థులు ప్రదర్శించేటప్పుడు చూపరుల శరీరం రోమాంచితమైంది. నాటకంలో రవి పాత్రను సౌందర్య, తల్లి పాత్రను లావణ్య, అవినీతి భూతం పాత్రను నాగవేణి పోషించారు. అనంతరం రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.