
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చైతన్యపురి: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలోని మరో ఇద్దరిపై చైతన్యపురి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన అల్లని శ్యాం (49), విజయవాడకు చెందిన రామిశెట్టి సంధ్య (32) హైదరాబాద్‌కు వచ్చి సులువుగా డబ్బు సంపాదించేందుకు లొకాంటో వెబ్‌సైట్‌లో యువతుల అర్ధనగ్న చిత్రాలు పెట్టి ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం ప్రారంభించాడు.
పేదలు, కార్మికుల, ఒంటరి మహిళలకు డబ్బు ఆశచూపి వారి ద్వారా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో అల్కాపురిలోని ఓ అపార్టుమెంటులో పోలీసులు దాడి చేసి నిర్వహకులతో పాటు పలు యువతులను రక్షించారు. అనంతరం నిందితులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఇద్దరి పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment