Theives gang
-
కటకటాలకు కంత్రీగాళ్లు
ఆధార్ మార్ఫింగ్ చేసి.. ఫోర్జరీ సంతకాలతో భూమి కొట్టేసి.. రూ.కోట్లు కొల్లగొట్టాలనుకున్న కంత్రీగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. కేసులో ఐదుగురు నిందితులు హనుమంతాచారి అలియాస్ హనుమంతు, వేణుగోపాల్, రమేష్ రామ్మోహన్‌రెడ్డి, వడ్డే రాముడును రుద్రంపేట వద్ద అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరిపై 420, 467, 468, 470, 471, 120 బీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఎక్సైజ్ కోర్టులో న్యాయమూర్తి ఓంకార్ ఎదుట హాజరుపరిచారు. ఆయన వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వెల్లడించారు. సాక్షి అనంతపురం: అనంతపురంలోని వక్కలం వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటసుబ్బయ్యకు వెంకటరమణ, నందకిషోర్ సంతానం. వెంకటసుబ్బయ్యకు వివిధ ప్రాంతాల్లో రూ కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అందులో భాగంగా రాచానపల్లి సర్వే నంబర్ 127లో 14.96 ఎకరాల భూమి ఉంది. రూ.45 కోట్లు విలువ చేసే ఈ భూమిపై అంపగాని శ్రీనివాసులు (పక్ష పత్రిక ప్రతినిధి)పై కన్నుపడింది. ఇతని సమీప బంధువు, వరుసకు బావ అయిన సత్యమయ్య (అంపగాని శ్రీనివాసులు బినామీ), వివిధ టీవీ చానళ్లలో పని చేసే హనుమంతాచారి అలియాస్ హనుమంతు, వేణుగోపాల్, రమేష్ రామ్మోహన్‌రెడ్డితో ముఠాగా ఏర్పడ్డారు. భూ‘మాయ’ మొదలైందిలా.. వెంకటసుబ్బయ్య స్థిరాస్తిని కాజేయడానికి అంపగాని శ్రీనివాసులు ముఠా పలు దఫాలు ప్రయత్నాలు చేసింది. మొదట వెంకట సుబ్బయ్య కుమారుడైన వెంకటరమణ ఆధార్‌ను బుక్కరాయసముద్రం చెన్నంపల్లికి చెందిన తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫొటోతో మార్చాలని చూశారు. వెంకటరమణ అడ్రస్‌కు తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫొటోతో కూడిన ఆధార్ వెళ్లడంతో వారు అప్రమత్తమై వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 21న తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రెండో ప్రయత్నంలో ముఠా సభ్యులు ఆర్కే నగర్‌కు చెందిన బత్తల శేఖర్, అచ్చుకట్ల ఇంతియాజ్ (తహసీల్దార్ కార్యాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి), కర్తనపర్తి సురేష్ (ఆధార్ సెంటర్ నిర్వాహకుడు) సహాయంతో వెంకటసుబ్బయ్య ఆధార్‌లోని ఫొటోకు బదులుగా హకీం అబ్దుల్ మసూద్ అనే వ్యక్తి ఫొటోను అప్డేట్ చేశారు. అప్డేట్ ఆధార్ కార్డు వెంకటసుబ్బయ్య అడ్రెస్‌కు వెళ్లడంతో ఏదో జరుగుతోందని భావించి.. కుటుంబ సభ్యులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శేఖర్, ఇంతియాజ్‌ను ఈ నెల 21న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మూడో ప్రయత్నంలో ముఠా సభ్యులు విజయం సాధించారు. టీచర్స్ కాలనీకి చెందిన వడ్డే రాముడు ఆధార్ కార్డులో వడ్డే రాముడు పేరు బదులుగా వెంకటసుబ్బయ్య పేరు, అతని తండ్రి పేరును నవీకరించారు. అదే విధంగా వెంకటసుబ్బయ్య ఫోన్ నంబర్‌కు బదులుగా వడ్డే రాముడు ఫోన్ నంబర్‌నే ఆధార్‌లో పొందుపర్చారు. అడ్రస్ సైతం వడ్డే రాముడిదే ఉంచారు. ఈ విధంగా వడ్డే రాముడినే వెంకటసుబ్బయ్యగా చూపుతూ ఈ నెల ఒకటో తేదీన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అంపగాని శ్రీనివాసులు బావ అయిన సత్యమయ్యకు 14.96 ఎకరాలు రిజి్రస్టేషన్ చేయించారు. అలా రిజిస్ట్రేషన్ చేయించిన భూమిని పెదవడుగూరుకు చెందిన ప్రస్తుతం నగరంలో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవేందర్‌రెడ్డికి ఎకరా రూ.కోటి చొప్పున విక్రయిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకోసం దేవేందర్‌రెడ్డి అడ్వాన్స్ రూపంలో సదరు ముఠా సభ్యులకు కోటీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. పరారీలో రంగనాయకులు.. మూడో ప్రయత్నం సఫలమవడానికి హనుమంతాచారి అలియాస్ హనుమంతు ద్వారా సీన్లోకి వచ్చిన రంగనాయకులు అలియాస్ కేశవ (గోల్డ్ స్మిత్) ఆధార్ మార్పులో కీలకంగా వ్యవహరించాడు. ఆధార్ మార్చడానికి, వడ్డే రాముడును తీసుకువచ్చిన రంగనాయకులుకు అంపగాని శ్రీనివాసులు, సత్యమయ్య, హనుమంతు, వేణుగోపాల్, రమేష్, రామ్మోహన్‌రెడ్డి రూ.18 లక్షలు ముట్టజెప్పినట్లు విచారణలో తేలింది. ఆధార్ మార్పునకు సహకరించిన రంగనాయకులు పరారీలో ఉన్నాడు. ఇలా వెలుగులోకి.. మార్పులతో వచ్చిన ఆధార్ కార్డులు ఇంటికి రావడంతో వెంకటసుబ్బయ్య కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వెంకటసుబ్బయ్య కుమారుడైన నందకిషోర్(ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్) రిజి్రస్టేషన్ కార్యాలయానికి వెళ్లి చూడగా ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఏడో తేదీన డీపీఒలో జరిగిన ‘స్పందన’ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పకు నందకిషోర్ ఫిర్యాదు చేశాడు. సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఎస్పీ ఆదేశించారు. డీఎస్పీ లోతుగా విచారణ చేపట్టడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. -
దొంగ సొత్తు చెరువులో ఉందా..?
టెక్కలి: టెక్కలిలో ఈనెల 22న ఓ కిరాణా వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీకి సంబంధించి టెక్కలి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ ఎంవీ గణేష్ నేతృత్వంలో గత కొద్ది రోజులుగా ఒడిశా ప్రాంతాల్లో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఒక దొంగ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దొంగ ఇచ్చిన సమాచారంతో ఒడిశా పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు కండ్రవీధిలో గల ఓ చెరువులో నగల కోసం అన్వేషించినట్లు సమాచారం. జిల్లాలో వరుసగా జరుగుతున్న వివిధ రకాల సంఘటనల నేపథ్యంలో టెక్కలిలో జరిగిన భారీ చోరీపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భారీ చోరీలో దొంగలు కాజేసిన రూ.2.40 లక్షల నగదు, 14 తులాల బంగారాన్ని రికవరీ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: బాలింతల సేవలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్) -
‘పసిడి’పురిలో...భయం భయం.!
సాక్షి, ప్రొద్దుటూరు(కడప) : దేశంలోనే పేరు గాంచిన ప్రొద్దుటూరు బంగారు మార్కెట్‌పై దొంగలు పంజా విసురుతున్నారు. అనుకున్నదే తడవుగా బంగారు నగలను సులభంగా కొట్టేస్తున్నారు. మాయ మాటలు చెప్పి మరీ బంగారు నగలతో ఉడాయిస్తున్నారు. రైళ్లలో కూడా బంగారు నగలను కొట్టేస్తుండటంతో వర్తకులు ప్రొద్దుటూరుకు రావడానికి జంకుతున్నారు. మంచి నాణ్యత, కచ్చితమైన ధర ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు నిత్యం కొనుగోలు దారులు ఇక్కడికి వస్తుంటారు. స్థానికంగా ఉన్న స్వర్ణకారులే కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తూ కోరిన డిజైన్లలో ఆభరణాలను తయారు చేస్తుంటారు. దీంతో పూర్వం నుంచి ప్రొద్దుటూరు మార్కెట్‌కు మంచి పేరుంది. అయితే మార్కెట్లో జరిగే మోసాలు, ఐపీలు, చోరీలు పసిడి వ్యాపారంపై ప్రభావాన్ని చూపుతాయేమోనని వ్యాపారులు, స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. కోయంబత్తూరు, చెన్నై, ముంబయి తదితర ప్రాంతాల వారికి ఇక్కడి వ్యాపారులు బంగారు నగలు తయారు చేయడానికి ఆర్డర్లు ఇస్తుంటారు. ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్ద మొత్తంలో బంగారు నగలు తయారు చేసుకొని రోజు ప్రొద్దుటూరుకు వస్తారు. అయితే రైళ్లతో పాటు దారిలో అటకాయించి బంగారు నగలను దోచుకున్న సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో వ్యాపారులు ఎర్రగుంట్లకు రైల్లో వచ్చి ప్రొద్దుటూరుకు చేరుకునేవారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో వ్యాపారులు వేర్వేరు ప్రాంతాల మీదుగా ఇక్కడికి వస్తున్నారు. వీళ్లు తెచ్చే బంగారు నగలకు చాలా వరకు బిల్లులు ఉండవు. దీంతో పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ వాళ్ల కళ్లు గప్పి రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రొద్దుటూరులో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలతో బంగారు మార్కెట్లో అయోమయం నెలకొంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నెలన్నర క్రితం ప్రొద్దుటూరులోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ దలై అనే స్వర్ణకారుడి నుంచి 100 గ్రాముల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకొని వెళ్లాడు. తనకు కొత్త మాడళ్లతో బంగారు చైన్లు తయారు చేయించాలని, కొన్ని రకాల చైన్లు చూపిస్తే తన అన్నకు చూపించి వస్తానని చెప్పి బంగారు నగలతో ఉడాయించాడు. కోయంబత్తూరు నుంచి రైలులో ప్రొద్దుటూరుకు బంగారు నగలను తీసుకొని వస్తున్న వ్యాపారిని రైల్వే పోలీసులమని చెప్పి నలుగురు వ్యక్తులు చిత్తూరు జిల్లా పాకాల వద్ద బెదిరించి 1.5 కిలోల బంగారు నగలను దోచుకొని వెళ్లారు. వారంతా ప్రొద్దుటూరు పరిసర ప్రాంత వాసులు కావడంతో ఆ బంగారాన్ని ఇక్కడే కరిగించి విక్రయించారు. కొన్ని రోజుల క్రితం ఒక స్వర్ణకారుడు మార్కెట్లోని వ్యాపారి వద్దకు వెళ్లి గిరాకి వచ్చిందని, బంగారు నగల బాక్స్‌లు పంపించమని అడిగాడు. దీంతో ఆ వ్యాపారి తన వద్ద ఉన్న గుమాస్తాకు నాలుగు బంగారు నగల బాక్స్‌లు ఇచ్చి పంపించాడు. గుమాస్తా అక్కడే కూర్చొని ఉండగా ‘ కొంచెం ఆలస్యం అవుతుంది.. నువ్వు వెళ్లు.. నేను తర్వాత తీసుకొని వస్తాను ’అని చెప్పడంతో అతను వెళ్లిపోయాడు. అతను అలా వెళ్లిపోగానే స్వర్ణకారుడు నగల బాక్స్‌లతో ఉడాయించాడు. ఖాదర్‌హుస్సేన్ మసీదు వీధిలో ఉంటున్న ఒక వ్యాపారి వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి స్వచ్ఛత కలిగిన బంగారు కావాలని అడిగారు. అతను లేదని చెప్పగా ఇదిగో డబ్బు తీసుకొని బంగారు ఇవ్వు అంటూ నోట్ల కట్టలను అతని ముక్కు వద్ద పెట్టారు. దీంతో అతను స్పృహ కోల్పోగా దుకాణంలో ఉన్న నగలు తీసుకొని వారు పారిపోయారు. భయంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొన్నేళ్ల క్రితం బంగారు నగలతో కారులో ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న కోయంబత్తూరు వ్యాపారిని దారిలో గుర్తు తెలియని దుండగులు అటకాయించి బంగారు నగలను దోచుకున్నారు. నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారం తీసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన స్వర్ణకారులు అనేక మార్లు పారిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. జడలగారి వీధి సమీపంలో డై మిషన్, చైన్ కంపెనీ నుంచి అక్కడే పని చేసే కొందరు పని వాళ్లు సుమారు 500 గ్రాముల బంగారుతో పరారయ్యారు. రాయల్ కాంప్లెక్స్‌లో కొన్ని నెలల క్రితం బంగారు వ్యాపారి సుమారు రూ. 10 కోట్ల మేర డబ్బు, బంగారంతో పారిపోయాడు. మెయిన్‌బజార్ సర్కిల్లో ఉన్న ఒక బంగారు వ్యాపారి కొన్ని రోజుల క్రితం రూ. 8 కోట్లు బాకీ చేసి ఐపీ పెట్టాడు. -
రెండు నెలల్లో 70 గేదెలు మాయం
సాక్షి, అచ్చంపేట(గుంటూరు) : గేదెలను అపహరిస్తున్న దొంగలను మండలంలోని పుట్లగూడెం గ్రామస్తులు పట్టుకుని బుధవారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెండు మూడు నెలలుగా మండలంలో గేదెల దొంగతనాలు ఎక్కువయ్యాయి. రాత్రి సమయాలలో ఇళ్ల ముందు కట్టేసిన గేదెలను, పగటి పూట పొలాలు వెళ్లిన గేదెలు, ఆవులను కొంతమంది దొంగలించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుట్లగూడానికి చెందిన సుమారు 15 గేదెలు గత రెండు నెలలకాలంలో మాయమయ్యాయి. రెండు మూడు రోజులుగా గ్రామస్తులు దొంగలను పట్టుకోవాలన్న తపనతో కాపుకాసి రాత్రి గస్తీ తిరిగారు. మంగళవారం రాత్రి మినీలారీలో 4 గేదేలు తరలించడం చూసిన గ్రామస్తులు వారిని వెంబడించి చల్లగరిగ వద్ద అటకాయించారు. అవి అపహరించబడిన గేదెలుగా గుర్తించి అచ్చంపేట ఎస్ఐకి సమాచారం అందచేశారు. ఎస్ఐ తన సిబ్బంది సహాయంతో లారీని, గేదెలను, నిందితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండు నెలల కాలంలో సుమారు 70కి పైగా గేదెలు అచ్చంపేట పరిసర గ్రామాల్లో చోరీకి గురయ్యాయి. అచ్చంపేట రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మరమెల ప్రసాదరావు, మార్టూరి నరసింహస్వామి, చిట్టేటి జాన్సీ అనే వారు తమ గేదెలు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పట్టాభిరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీకి యత్నించిన దొంగల ముఠా అరెస్టు
ఆలేరు(నల్లగొండ): చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన దొంగల ముఠాను నల్లగొండ జిల్లా ఆలేరు పోలీసులు పట్టుకున్నారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈశ్వర్‌సింగ్, చన్నరాం, జిత్, దినేష్ చౌహాన్, మోరేసింగ్, పురారాం అనే ఆరుగురు వ్యక్తులు వరంగల్ జిల్లాలో జీవనోపాధి కోసం వివిధ పనులు చేసేవారు. ఆదాయం సరిపోక పోవడంతో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ముఠాగా ఏర్పడి ఈ నెల 6వ తేదీన ఆలేరులో ఓ బంగారం షాపులో చోరీకి యత్నించారు.. విఫలం కావడంతో తప్పించుకున్నారు. దీంతో స్థానిక ఎస్సై రాఘవేందర్, ఐడీ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 10వ తేదీన వరంగల్ జిల్లా జనగామ బస్టాండ్‌లో చోరీకి యత్నిస్తుండగా పట్టుకున్నారు. వీరిని ఆలేరు కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ తెలిపారు. బృందంలోని పురారాం అనే వ్యక్తి పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. వారి నుంచి రెండు చాకులు, కారంపొడి ప్యాకెట్, రెండు ప్లాస్టర్లు, చిన్న బ్యాగ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
దొంగల ముఠా అరెస్టు
నాగోలు: బస్సుల్లో.. వస్త్ర దుకాణాల్లో దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేటలో నివాసముంటున్న ఇంగుర్తి శ్రీను (27), ఇంగుర్తి విశ్వరూపాచారి (50), ఖమ్మం పట్టణానికి చెందిన నల్లగొండ కౌసల్య, నల్లగొండ ఈదమ్మలు ముఠాగా ఏర్పడి దృష్టి మళ్లించి బస్సులు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఎల్బీనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో దొంగల ముఠా అరెస్టు
హైదరాబాద్ సిటీ: నగరంలో నలుగురు సభ్యులున్న దొంగల ముఠాను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఏడు చోట్ల చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. రాత్రివేళ్లల్లో ఎవరూలేని సమయం చూసి అపార్టుమెంటుల్లో చోరీకి పాల్పడుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.