ఆలేరు(నల్లగొండ): చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన దొంగల ముఠాను నల్లగొండ జిల్లా ఆలేరు పోలీసులు పట్టుకున్నారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈశ్వర్‌సింగ్, చన్నరాం, జిత్, దినేష్ చౌహాన్, మోరేసింగ్, పురారాం అనే ఆరుగురు వ్యక్తులు వరంగల్ జిల్లాలో జీవనోపాధి కోసం వివిధ పనులు చేసేవారు. ఆదాయం సరిపోక పోవడంతో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
ముఠాగా ఏర్పడి ఈ నెల 6వ తేదీన ఆలేరులో ఓ బంగారం షాపులో చోరీకి యత్నించారు.. విఫలం కావడంతో తప్పించుకున్నారు. దీంతో స్థానిక ఎస్సై రాఘవేందర్, ఐడీ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 10వ తేదీన వరంగల్ జిల్లా జనగామ బస్టాండ్‌లో చోరీకి యత్నిస్తుండగా పట్టుకున్నారు. వీరిని ఆలేరు కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ తెలిపారు. బృందంలోని పురారాం అనే వ్యక్తి పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. వారి నుంచి రెండు చాకులు, కారంపొడి ప్యాకెట్, రెండు ప్లాస్టర్‌లు, చిన్న బ్యాగ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
చోరీకి యత్నించిన దొంగల ముఠా అరెస్టు
Published Tue, Aug 11 2015 6:53 PM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM
Advertisement
Advertisement