అధికార పార్టీ తరఫున..దర్జాగా ప్రచారం | Government Officers In Election Campaign | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ తరఫున..దర్జాగా ప్రచారం

Published Wed, Mar 20 2019 11:58 AM | Last Updated on Wed, Mar 20 2019 12:01 PM

Government Officers In Election Campaign - Sakshi

అచ్చెన్నాయుడు నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న పీఆర్‌ ఉద్యోగి శ్రీనివాస్‌

సాక్షి, టెక్కలి: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తరఫున విధులకు డుమ్మా కొట్టి రాజకీయ ప్రచారం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. వారిలో కోటబొమ్మాళి మండలానికి సంబంధించి పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్న కమ్మకట్టు శ్రీనివాసరెడ్డి ఒకరు. ఆయన కోటబొమ్మాళి మేజర్‌ పంచాయతీలో మంత్రి అచ్చెన్నాయుడితో పాటు   రాజకీయ ప్రచారంలో స్వయంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే సోమవారం రాత్రి అచ్చెన్నాయుడు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మంత్రితో పాటు హాజరయ్యారు. అలాగే మండలంలో గల ఎత్తురాళ్లపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సనపల గుర్రయ్య, స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న అన్నెపు రాధాకృష్ణ, తదితరులు విధులు పక్కన పెట్టి టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వారిపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నెపు రామారావు, కాళ్ల సంజీవరావు, సంపతిరావు హేమసుందరరాజులు ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement