శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి సమీపంలోని కొత్తపేట జంక్షన్‌లో గురువారం పట్టపగలు దోపిడి జరిగింది.
టెక్కలి (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి సమీపంలోని కొత్తపేట జంక్షన్‌లో గురువారం పట్టపగలు దోపిడి జరిగింది. స్థానిక కిరాణా దుకాణంలో సరుకులు కొనడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు యజమాని పై దాడి చేసి కౌంటర్‌లో ఉన్న రూ. 15 వేల నగదుతో ఉడాయించారు. దీంతో షాపు యజమాని పోలీసులను ఆశ్రయించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.