టెక్కలి: ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ శనివారం ఓ యువతి ఆత్మహత్యకు యత్ని ంచింది. రైలు పట్టాల వద్ద కూర్చుని రోదిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించడంతో ప్రమాదం నుంచి బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం తెంబూరుకి చెందిన ఓ యువతి టెక్కలిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం మధ్యలో మానేసింది. మొదటి సంవత్సరంలో ఉండగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పాతపట్నంకు చెందిన పాడి దిలీప్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి కళాశాలకు వెళ్లి వచ్చేవారు.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికి దిలీప్‌కుమార్ ఆ యువతిని గర్భవతిని చేశాడు. యువతి పెళ్లి చేసుకోవాలని గట్టిగా అగడంతో అందుకు నిరాకరించాడు. ఆమెకు కనిపించకుండా పరారయ్యాడు. ఈ విషయం ఆ యువతి ఇంట్లో తెలియజేసింది. వారు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందాం అని శనివారం టెక్కలి గోపినాథపురం సమీపంలో రైల్వే పట్టాల వద్దకు వచ్చి రోదిస్తోంది.
అదే సమయంలో రైలు వస్తుండడం.. ఆ యువతి తీవ్రంగా రోదిస్తుండడంతో స్థానికుడు ఒకరు గమనించి స్థానికుల సహాయంతో ఆ యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఏం జరిగిందని ఆరా తీసి పోలీసులకు అప్పగించారు. టెక్కలి ఎస్‌ఐ రాజేష్ బాధితురాలితో కలసి పాతపట్నం వెళ్లి అక్కడ వివరాలు సేకరించారు. ఆ యువకుడు అందుబాటులో లేకపోవడంతో అతని కోసం గాలింపునకు చ ర్యలు తీసుకున్నారు. బాధితురాలిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని సూచిం చారు. దిలీప్‌కుమార్ దొరికిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని పోలీసులు ఓ యువతికి హామీ ఇచ్చారు.
ప్రియుడు మోసగించాడంటూ యువతి ఆత్మహత్యాయత్నం
Published Sun, Mar 22 2015 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement