woman commit suicide
-
భర్త వేధింపులు తాళలేక.. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
పోచారం: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా, మాదారం గ్రామానికి చెందిన భారతి (30) నగరానికి వలసవచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. చింతా లక్ష్మణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుంది. లక్ష్మణ్ కొర్రెముల గ్రామం వద్ద చికెన్ షాపు నిర్వహించేవాడు. గత కొన్నాళ్లు మద్యానికి బానిసైన లక్ష్మణ్ షాప్ తెరవడం లేదు. ఈ నెల 8న ఉదయం భారతి భర్తను పద్ధతి మార్చుకోవాలని చెప్పడంతో అతను ఆమెపై దాడి చేశాడు. కాగా అదే రోజు సాయంత్రం లక్ష్మణ్ భారతి సోదరుడు మహేష్ కు వీడియో కాల్చేసి భారతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుందని చెప్పాడు. ఆమెను కాపాడాలని వేడుకున్నా పట్టించుకోకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మహేష్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. భర్త వేధింపుల కారణంగా తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి మృతిని తట్టుకోలేక.. ఉరేసుకొని ప్రియురాలు ఆత్మహత్య
హైదరాబాద్: ఇద్దరు ఒకే బేకరీలో పని చేసేవారు.. వీరి మధ్య ఏర్పపడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి పెళ్లికి ప్రియుడి కుటుంబం నిరాకరించడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన ప్రేమికురాలు ఉరి వేసుకొని తనువు చాలించిన విషాద ఘటన గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జేమ్స్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహ (19) ఎనిమిది నెలల క్రితం నగరానికి వచ్చి గౌలిదొడ్డిలోని జర్నలిస్ట్ కాలనీలో వైష్ణవి పీజీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. నానక్‌రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్‌లోని ఓ బేకరీలో సేల్స్ గర్ల్‌గా చేరింది. బాలాపూర్ పీఎస్ పరిధిలో వెంకటాపురంలో నివసించే సల్మాన్ ఆరు నెలల క్రితం సదరు బేకరీలో చేరాడు. వీరిరువురు మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో సల్మాన్‌ను బేకరీ నుంచి తొలగించారు. సల్మాన్ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సల్మాన్ ఈ నెల 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడు చనిపోయిన విషయం తెలియడంతో నేహ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు రూమ్ మేట్స్ డ్యూటికీ వెళ్లగానే తలుపు గడియ పెట్టుకుంది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ నిర్వాహకులు వెంటనే గచి్చ»ౌలి పోలీసులకు సమాచారం అందించారు. ప్రియుడు సల్మాన్ ఆత్మహత్యను జీరి్ణంచుకోలేక తనువు చాలించిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఎందుకమ్మా ఇలా చేశావ్!
సాక్షి, వికారాబాద్ అర్బన్: నవమాసాలు మోసి ఇద్దరు బంగారు తల్లులను కన్న ఓ తల్లి.. చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కొనఊపిరితో మృత్యుఒడి నుంచి బయటపడిన ఆమె తన కంటి పాపలను మాత్రం కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ధారూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మిని నాలుగేళ్ల క్రితం బంట్వారం గ్రామానికి చెందిన ఆమె మేనబావ గోపాల్‌కు ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. ఏడాది పాటు బంట్వారంలో ఉన్న దంపతులు ఆ తర్వాత వికారాబాద్ వచ్చి ఎన్నెపల్లిలో కాపురం పెట్టారు. వీరికి కృప(2), శ్రేష్ట( 9 నెలల) పాపలు ఉన్నారు. భాగ్యలక్ష్మి రెండేళ్లుగా పట్టణంలోని మహవీర్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త గోపాల్ మాత్రం మద్యానికి బానిసై ఏపనీ లేకుండా తిరుగుతున్నాడు. అంతేకాకుండా భాగ్యలక్ష్మిని వేధిస్తూ.. ఇంట్లో ఉన్న డబ్బులు దొంగిలించడం, బలవంతంగా లాక్కోవడం వంటివి చేస్తున్నాడు. ఇవ్వకపోతే దాడికి పాల్పడుతున్నాడు. నిత్యం ఈ నకరాన్ని భరించలేకపోయిన భాగ్యలక్ష్మి.. జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో శుక్రవారం తన ఇద్దరు పిల్లలను తీసుకుని పట్టణ సమీపంలోని శివారెడ్డిపేట్ చెరువు వద్దకు వెళ్లి అందులో దూకింది. అంతకు ముందు తన ఇద్దరు పిల్లలతో శివారెడ్డిపేట్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన వాట్సప్‌లో స్టేటస్ పెట్టుకుంది. ఇది గమనించి కొందరు సన్నిహితులు అక్కడకు వెళ్లేసరికి అప్పటికే తల్లీకూతుళ్లు చెరువు పడిపోయారు. స్థానికులు వీరిని రక్షించే ప్రయత్నం చేయగా భాగ్యలక్ష్మి కొన ఊరిపితో బయటపడింది. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు మాత్రం చెరువులో కలిసిపోయాయి. పోలీసులు, స్థానికులు చెరువులో దిగి గాలించగా ముందు పెద్ద పాప కృప శవమై కనిపించింది. అనంతరం గంట తర్వాత చిన్న పాప శ్రేష్ట మృతదేహం లభించింది. ప్రాణాలతో బయటపడ్డ తల్లికి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సంఘటన స్థలానికి వెళ్లిన డీఎస్పీ సంజీవరావు.. భాగ్యలక్ష్మి భర్త గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యలక్ష్మి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ, సీఐ రాజశేఖర్ తెలిపారు. భర్త గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కలెక్టరేట్లో దళిత ఉద్యోగిని ఆత్మహత్య
-
బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ..
♦ యువతి ఆత్మహత్యాయత్నం ♦ తన చావుకు ఏసీపీ కూడా కారణమంటూ లేఖ ♦ ప్రేమ వివాహం.. బలవంతపు పెళ్లంటూ ఫిర్యాదు ♦ ఫొటోలు ఫేస్బుక్లో పెట్టడంపై మనస్తాపం మందమర్రి (చెన్నూర్): తనను బలవంతంగా పెళ్లి చేసుకొని ఫొటోలు వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో పెట్టి పరువుకు భంగం కలిగించాడని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో క్యాతం శ్రీవాణి కుటుంబం నివసిస్తోంది. ఇటీవలే ఆమె సారంగపెల్లికి చెందిన అయిల్ల సాగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న సాగర్, శ్రీవాణి కాళేశ్వరంలో వివాహం చేసుకుని వస్తుండగా.. ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి సాగర్‌పై దాడిచేసి సోదరిని ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. సాగర్ భయపెట్టి.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ బెల్లంపల్లి ఏసీపీకి శ్రీవాణి, సోదరుడు కలసి ఫిర్యాదు చేశారు. తాను బలవంతంగా పెళ్లి చేసుకోలేదని, పెళ్లి ఫొటోలే నిదర్శమంటూ శ్రీవాణితో దిగిన ఫొటోల్ని సాగర్ సోషల్‌మీడియాలో పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీవాణి గురువారం నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించారు. కమిషనర్‌కు ఫిర్యాదు...: తమ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్ట డం లేదని,సాగర్‌తోనే కాపురం చేయాలని ఏసీ పీ బెదిరిస్తున్నాడని శ్రీవాణి ఇటీవల మీడియా తో మాట్లాడింది. పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ దృష్టికి తీసుకెళ్లింది. తనకు న్యాయం చేయకుండా, తన అన్నయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ ఏసీపీ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. శ్రీవాణి రాసిన సూసైడ్ నోట్: ‘అమ్మ..అన్నయ్య..అక్కలందరూ నన్ను క్షమిం చండి. నేను చేసిన తప్పునకు క్షమించండి. ఇక ఈ భూమి మీద బతికే ఆశ నాకు లేదు. సాగర్, భీరెల్లి రాములు, పానుగంటి సతీశ్ నా వీడియోలు, ఫొటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేసి మన పరువు తీస్తున్నారు. ఇక్కడి ఏసీపీ సతీష్ కూడా అసభ్యంగా మాట్లాడుతూ నేను ఇచ్చిన కేసును దర్యాప్తు చేయకుండా అన్నయ్యను, నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా చావు కు ఏసీపీ సతీష్, సాగర్, రాములు, పాను గం టి సతీష్‌లే కారణం. నా చావుకు కారణమైన వీరిని అసలే వదలకండి. అన్నయ్యా.. నన్ను క్షమించు సారీ.. సారీ’ ఇట్లు నీ చెల్లెలు శ్రీవాణి అని రాసుంది. కాగా, నిందితులపై చర్య తీసుకోవాలని శ్రీవాణి బంధువులు మంచిర్యాల ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. డీసీపీ జాన్‌వెస్లీ బాధితులతో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించుకున్నారు. -
ఏపీ అసెంబ్లీ గేట్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
-
సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కాదన్నాడని...
యువతి ఆత్మహత్య పీఎంపాలెం(విశాఖపట్నం): ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తి నమ్మక ద్రోహం చేయడంతో ఓ యువతి ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ సంఘటన మారికవవలస రాజీవ్ గృహకల్పలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మృతురాలి బంధువులు, పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన జామి ఆదినారారయణకు ముగ్గురు కుమార్తెలు. చిన్నకుమార్తె పద్మ (25), వారి ఇంటి సమీపంలోనే నివశిస్తున్న కె.రామ మోహన్‌రావు సుమారు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో గత సంవత్సరం జూలై నెలలో ఇరు కుటుంబాలకు తెలియజేయకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. రామమోహన్‌రావు ఆర్మీ ఉద్యోగి కావడంతో వివాహం చేసుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అనంతరం మారికవలస రాజీవ్ గృహకల్ప ప్లాట్ నంబరు 61లో నివసిస్తున్న రెండో అక్క రమ వద్దకు పద్మ వచ్చి ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రమ తన చెల్లి పద్మను స్థానికంగా ఉన్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో చేర్పించింది. పెళ్లి గురించి పెద్దలకు చెప్పకపోయినా ఫోనులో మాత్రం రోజూ రామమోహన్‌రావుతో పద్మ మాట్లాడుతుండేది. తాము ఇద్దరం భార్యా భర్తలమే అన్న నమ్మకంతో పద్మ ఆనందంగా ఉండేది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి స్వస్థలం వచ్చిన రామమోహన్‌రావు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇంటికి తీసుకెళ్లలేనని స్పష్టం చేశాడు. దీంతో తన పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు, పెద్దలకు చెప్పుకుని పద్మ విలపించింది. పెద్దలు రంగంలోకి దిగి ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ రామమోహన్‌రావు అంగీకరించలేదు. మరో పెళ్లి చేసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన పద్మ ఆదివారం మధ్యాహ్నం అక్క ఇంట్లో లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎప్పుడూ చలాకీగా కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండే పద్మ ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న బంధువులు రాజాం నుంచి తరలివచ్చారు. విగత జీవిగా ఉన్న పద్మను చూసి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో విషాదం నెలకొంది. ప్రేమించి, పెళ్లి చేసకుని, తర్వాత ముఖం చాటేసిన ఆర్మీ ఉద్యోగి రామ మోహన్రావుని కఠినంగా శిక్షించాలని మృతురాలి అక్క రమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ కె.లక్ష్మణరావు పర్యవేక్షణలో ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి ఆత్మహత్యాయత్నం
ఏలూరు(సెంట్రల్) : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువకుడు మోసం చేశాడంటూ ఓ యువతి శనివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బీడీ కాలనీకి చెందిన ఓ యువతి (22) బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేసింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న స్థానిక ఫతైబాదకు చెందిన పసుపులేటి శ్రీనివాస్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సహజీవనం కూడా సాగించాడు. దీంతోపాటు ఆమె వద్ద నుంచి రూ.రెండులక్షలు తీసుకుని పెళ్లి విషయం వచ్చేసరికి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌తో వివాహం చేయిస్తానని చెప్పి మరో వ్యక్తి రూ.25 వేలు ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. అయినా శ్రీనివాస్ నుంచి సమాధానం రాకపోవడంతో మనస్థాపానికి గురైన యువతి శనివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆ యువతి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌తో పాటు మరో ముగ్గురిపై టూటౌన్ సీఐ బంగార్రాజు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘డబుల్’ గ్రామసభలో మహిళ ఆత్మహత్యాయత్నం
► అర్హులకు అన్యాయం చేశారని ఆరోపణ ► అధికారులతో గ్రామస్తుల వాగ్వాదం ► అర్ధంతరంగా సభ నిలిపివేత శంకరపట్నం : డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని ఓ మహిళ రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని కొత్తగట్టు గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలో 160 మంది డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ గ్రామానికి ప్రభుత్వం 20 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. అందులో ఎస్సీలకు 13, బీసీలకు 9, ఓసీలకు 2, మైనారిటీలకు ఒకటి కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ ఆమోదంతో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తహశీల్దార్ సంపత్ తెలిపారు. జాబితాను చదువుతుండగానే గ్రామస్తులు అధికారులతో గొడవకు దిగారు. గ్రామానికి చెందిన అంబాల మౌనిక కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తున్నా అభ్యంతరం చెప్పడంతో తొలగించారు. మిగతా జాబితా చదువుతుండగానే గీతాకార్మిక కుటుంబానికి చెందిన తాము 15 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నామని పైడిపెల్లి రేణుక కుటుంబం అధికారులతో వాగ్వాదానికి దిగింది. తమకు అన్యాయం జరిగిందని పైడిపెల్లి రేణుక,పైడిపెల్లి లత, పైడిపెల్లి సుమలత, పైడిపెల్లి లావణ్య కంటతడిపెట్టారు. ఈ నలుగురిలో ఒకరికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని గ్రామస్తులు సూచించగా జాబితాలో పేరు లేదని, తాము ఏమీ చేయలేమని అధికారులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన రేణుక రసాయన ద్రావణం తాగింది. ఎంపీపీ విజయ, అధికారులు, గ్రామస్తులు రసాయన ద్రావణం బాటిల్ లాక్కున్నారు. ఆత్మహత్యాయత్నాకి యత్నించిన రేణుకను ఎంపీపీ ఓదార్చారు. ఆత్మహత్య పరిష్కారం కాదని ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తుందని నచ్చజెప్పారు. గ్రామసభలో మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో అధికారులు సభను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. అర్హులకు అన్యాయం జరిగింది.. కొత్తగట్టు గ్రామంలో డబుల్ బెడ్రూం ఎంపికలో అర్హులకు అన్యాయం చేశారని ఎంపీటీసీ సభ్యుడు ఉప్పుగల్ల మల్లారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అనర్హులను ఎంపిక చేశారని ఆరోపించారు. గ్రామసభలో రేణుక ఆత్మహత్యాయత్నం చేయడం అధికారుల తప్పిదమేనని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం అబ్ధిదారుల ఎంపిక కోసం మరోసారి గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
అత్తింటి వేధింపులు,కోడలి ఆత్మహత్య
-
ప్రియుడు మోసగించాడంటూ యువతి ఆత్మహత్యాయత్నం
టెక్కలి: ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ శనివారం ఓ యువతి ఆత్మహత్యకు యత్ని ంచింది. రైలు పట్టాల వద్ద కూర్చుని రోదిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించడంతో ప్రమాదం నుంచి బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం తెంబూరుకి చెందిన ఓ యువతి టెక్కలిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం మధ్యలో మానేసింది. మొదటి సంవత్సరంలో ఉండగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పాతపట్నంకు చెందిన పాడి దిలీప్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి కళాశాలకు వెళ్లి వచ్చేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికి దిలీప్‌కుమార్ ఆ యువతిని గర్భవతిని చేశాడు. యువతి పెళ్లి చేసుకోవాలని గట్టిగా అగడంతో అందుకు నిరాకరించాడు. ఆమెకు కనిపించకుండా పరారయ్యాడు. ఈ విషయం ఆ యువతి ఇంట్లో తెలియజేసింది. వారు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందాం అని శనివారం టెక్కలి గోపినాథపురం సమీపంలో రైల్వే పట్టాల వద్దకు వచ్చి రోదిస్తోంది. అదే సమయంలో రైలు వస్తుండడం.. ఆ యువతి తీవ్రంగా రోదిస్తుండడంతో స్థానికుడు ఒకరు గమనించి స్థానికుల సహాయంతో ఆ యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఏం జరిగిందని ఆరా తీసి పోలీసులకు అప్పగించారు. టెక్కలి ఎస్ఐ రాజేష్ బాధితురాలితో కలసి పాతపట్నం వెళ్లి అక్కడ వివరాలు సేకరించారు. ఆ యువకుడు అందుబాటులో లేకపోవడంతో అతని కోసం గాలింపునకు చ ర్యలు తీసుకున్నారు. బాధితురాలిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని సూచిం చారు. దిలీప్‌కుమార్ దొరికిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని పోలీసులు ఓ యువతికి హామీ ఇచ్చారు. -
అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్..!
ఉసిరికాయలపల్లి (కారేపల్లి), న్యూస్‌లైన్: భర్తతో తరచూ గొడవలు.. తీవ్ర మానసిక వేదన తట్టుకోలేని ఓ వివాహిత పురుగు మందు తాగింది. తనను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న భర్త- తన బిడ్డడిని అనాధగా మారుస్తాడన్న భయంతోనో.. మరే కారణంతోనో.. నాలుగేళ్ల వయసున్న తన కుమారుడికి కూడా కొద్దిగా పురుగు మందు తాగించింది. ఆమె మృతిచెందింది. ఆ పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు... ఉసిరికాయలపల్లి గ్రామస్తుడు పచ్చిపాల శ్రీనివాస్‌కు తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన లక్ష్మి(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమారుడు (నాగసాయి) ఉన్నాడు. ఇల్లెందు మండలంలో గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్గా కాంట్రాక్ట్ పద్ధతిన శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. అతడు ప్రతి రోజు ఉసిరికాయలపల్లి నుంచి ఇల్లెందకు రాకపోకలు సాగిస్తున్నాడు. అతను మరో యువతితో వివాహేతర సంబంధం సాగిస్తూ, లక్ష్మిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీనిపై అతనిని లక్ష్మి పలుమార్లు నిలదీసింది. ఇదే విషయమై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయతీ నిర్వహించి శ్రీనివాస్‌ను మందలించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగెత్తిన లక్ష్మి.. తీవ్ర మానసిక ఆందోళనతో శుక్రవారం భర్త ఇంటిలో లేని సమయంలో తన నాలుగేళ్ళ కుమారుడు నాగసాయికి కొద్దిగా పురుగు మందు తాగించి, ఆ తరువాత తాను కూడా తాగి, ఇంటి ఆరుబయట మంచంపై పడుకుంది. నాగసాయి ఏడుస్తుండడాన్ని చుట్టుపక్కల వారు చూసి, ఇంట్లోకి వచ్చారు. మంచంపై లక్ష్మి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి, ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. చికి త్స చేస్తుండగానే ఆమె మృతిచెందింది. అప్పటికే నాగసాయి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 5 తెలంగాణపై కాంగ్రెస్ కొత్త నాటకాలు ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ కొత్త నాటకాలకు తెర లేపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ది వెంకటేశ్వర్లు విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ఒకపక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూనే.. మరోపక్క సీమాంధ్రులతో ఆందోళన చేయిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలపై నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్ వెనుకడుగు వేస్తే అది ఈ ప్రాంతంలో భూస్థాపితమవుతుందని అన్నారు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలోనిదేనని అన్నారు. గడిచిన పదేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీజేపీకి కూడా అనుకూల వాతావరణం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలో మూడో ప్రత్యామ్నాయం అవసరమని అన్నారు. రాష్ట్ర మంత్రులు రెండు ప్రాంతాలవారీగా విడిపోయి ప్రజాసమస్యలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇటీవలి వర్షాలతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వ ఆసక్తి చూపడం లేదని ధ్వజమెత్తారు. బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపూరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
లైగింక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
విశాఖ : నిర్భయ చట్టం మృగాలను మార్చలేకపోతున్నాయి. ఏకంగా... పోలీస్‌స్టేషన్ వెనకాలే లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలైంది. విశాఖ జిల్లా ఎస్ రాయవరం పోలీస్‌స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. రాయవరం పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉండే మహిళపై లక్కోజు రాజేశ్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తన కోరిక తీర్చమని ఫోన్ చేసి మరీ వేధింపులకు దిగాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా... రాజేష్ మారలేదు. దీంతో ఎక్కడ పరువు ఎక్కడపోతుందోనని కలత చెందిన ఆ మహిళ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది