ఏలూరు(సెంట్రల్) : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువకుడు మోసం చేశాడంటూ ఓ యువతి శనివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బీడీ కాలనీకి చెందిన ఓ యువతి (22) బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేసింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న స్థానిక ఫతైబాదకు చెందిన పసుపులేటి శ్రీనివాస్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సహజీవనం కూడా సాగించాడు.
దీంతోపాటు ఆమె వద్ద నుంచి రూ.రెండులక్షలు తీసుకుని పెళ్లి విషయం వచ్చేసరికి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌తో వివాహం చేయిస్తానని చెప్పి మరో వ్యక్తి రూ.25 వేలు ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. అయినా శ్రీనివాస్ నుంచి సమాధానం రాకపోవడంతో మనస్థాపానికి గురైన యువతి శనివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆ యువతి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌తో పాటు మరో ముగ్గురిపై టూటౌన్ సీఐ బంగార్రాజు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువతి ఆత్మహత్యాయత్నం
Published Sun, May 15 2016 3:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Advertisement