
లైగింక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
విశాఖ : నిర్భయ చట్టం మృగాలను మార్చలేకపోతున్నాయి. ఏకంగా... పోలీస్‌స్టేషన్ వెనకాలే లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలైంది. విశాఖ జిల్లా ఎస్ రాయవరం పోలీస్‌స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. రాయవరం పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉండే మహిళపై లక్కోజు రాజేశ్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
తన కోరిక తీర్చమని ఫోన్ చేసి మరీ వేధింపులకు దిగాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా... రాజేష్ మారలేదు. దీంతో ఎక్కడ పరువు ఎక్కడపోతుందోనని కలత చెందిన ఆ మహిళ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది