పక్కింటి అబ్బాయి వేధింపులు.. ఉరికి యత్నం | woman attempts suicide | Sakshi
Sakshi News home page

పక్కింటి అబ్బాయి వేధింపులు.. ఉరికి యత్నం

Published Thu, Feb 23 2017 2:31 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

woman attempts suicide

ముజఫర్‌ నగర్‌: యువకుల లైంగిక వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ పరిధిలోని షాపూర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. 23 ఏళ్ల మహిళపై కొంతమందితో కలిసి పొరిగింటి అబ్బాయి లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె ఉరేసుకొని చనిపోవడానికి ప్రయత్నించింది.

బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ ప్రయత్నం చేసినా అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు ముందస్తుగా గుర్తించి ఉరి నుంచి తప్పించారు. అనంతరం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement