S.Rayavaram
-
భారీ వర్షం.. కొట్టుకుపోయిన ఆలయం
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు,వంకలు ఏకమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలంలో వరద నీటిలో ఓ గుడి పునాదులతో సహా కొట్టుకుపోయింది. వరాన నది ఒడ్డును ఎన్నో ఏళ్ల క్రితం స్థానికులు నూకాలమ్మతల్లి ఆలయాన్ని నిర్మించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంత వరద నీరు వరాహ నదిలోకి వచ్చి చేరింది. నది గట్టు కోతకు గురికావడంతో నూకాలమ్మ ఆలయం నదిలో ఒరిగి పోయింది. కళ్ళ ముందు ఆలయం నది ప్రవహంలోకి వెళ్లడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. -
మహాకవి గురజాడ 152వ జయంతి
విశాఖపట్నం: మహాకవి గురజాడ అప్పారావు 152వ జయంతిని ఆయన స్వగ్రామం ఎస్.రాయవరంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, శానిటేషన్ శాఖల మంత్రి కిమిడి మృణాళిని ఆయన స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురజాడ పేరుమీద ఓపెన్ ఆడిటోరియం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. గురజాడ రచనలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని జిల్లాలలో గురజాడ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ** -
ఇసుక మాఫియా
=వరాహ, తాండవ నదుల్లో తవ్వకాలు =రోజూ వందలాది ట్రాక్టర్లతో తరలింపు =పట్టించుకోని రెవెన్యూ, పోలీసు యంత్రాంగం =సముద్రపు ఇసుకనూ వదలని వైనం నక్కపల్లి, న్యూస్లైన్: ఎస్.రాయవరం,నక్కపల్లి,పాయకరావుపేట, కోటవురట్ల మండలాల్లో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. రోజూ వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. అయినా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు వరాహనదిలో పొక్లెయినర్లు ఉపయోగిస్తున్నారంటే తరలింపు ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించుకోవచ్చు. వందలాది ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్లు మూలకు చేరే దుస్థితి దాపురించింది. ఎస్రాయవరం మండలంలో దార్లపూడి, పెనుగొల్లు,వమ్మవరం,పెద ఉప్పలం,దార్లపూడి,లింగరాజుపాలెం, బసవపాడు, కోటవురట్లమండలం పందూరు, రామచంద్రపురం, పాయకరావుపేట మం డలం కొత్తూ రు, సత్యవరం బ్రిడ్జి, కేశవరం,పాయకరావుపేట,ప్రాంతాల్లో రోజూ వేలాది క్యూబిక్ మీటర్ల లో ఇసుక తవ్వుతున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ట్రాక్ట ర్లు, లారీలపై తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ. 3వేల వరకు అమ్ముడుపోవడంతో మాఫియాకు కాసులు కురుస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వారు రెచ్చిపోతున్నారు. ఇందులో రెవెన్యూ, పోలీసు అధికారుల ప్రమేయం ఉంటోందన్న వాదన ఉం ది. ఇక తీరప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. రాజయ్యపేట, అమలాపురం, పాటిమీద, మూలపర, డిఎల్పురం,బోయపాడు, చందనాడ బంగారయ్యపేట, రేవుపోలవరం, బంగారమ్మపాలెం తదితర గ్రామాల్లో తీరప్రాం తం వెంబడి సముద్రపు ఇసుకను కూడా మాఫియా వదలడం లేదు. దీని తరలింపునకు వీఆర్వోలే సహకారిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇసుక తరలించుకుపోవడంతో తుఫాన్లప్పుడు సముద్రం ముందు కు చొచ్చుకు వస్తోంది. ముంపు బారిన పడే ప్రమాదం ఉందని గంగపుత్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
లైగింక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
విశాఖ : నిర్భయ చట్టం మృగాలను మార్చలేకపోతున్నాయి. ఏకంగా... పోలీస్స్టేషన్ వెనకాలే లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలైంది. విశాఖ జిల్లా ఎస్ రాయవరం పోలీస్స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. రాయవరం పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉండే మహిళపై లక్కోజు రాజేశ్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తన కోరిక తీర్చమని ఫోన్ చేసి మరీ వేధింపులకు దిగాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా... రాజేష్ మారలేదు. దీంతో ఎక్కడ పరువు ఎక్కడపోతుందోనని కలత చెందిన ఆ మహిళ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది