సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు,వంకలు ఏకమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలంలో వరద నీటిలో ఓ గుడి పునాదులతో సహా కొట్టుకుపోయింది. వరాన నది ఒడ్డును ఎన్నో ఏళ్ల క్రితం స్థానికులు నూకాలమ్మతల్లి ఆలయాన్ని నిర్మించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంత వరద నీరు వరాహ నదిలోకి వచ్చి చేరింది. నది గట్టు కోతకు గురికావడంతో నూకాలమ్మ ఆలయం నదిలో ఒరిగి పోయింది. కళ్ళ ముందు ఆలయం నది ప్రవహంలోకి వెళ్లడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment