boyfriend cheating
-
బంజారాహిల్స్‌లో దారుణం: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. నగ్న ఫొటోల్ని..
బంజారాహిల్స్: తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యూడ్ వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై బాధితురాలుఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్.ఎన్.నగర్లో నివసించే యువతికి అదే ప్రాంతంలో నివసిస్తున్న దెబాస్ దేకా(27)తో గతేడాది అక్టోబర్‌లో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అప్పటి వరకు సహజీవనంతో కలిసి ఉందామని నమ్మించాడు. తరచూ ఆమెకు ఇష్టం లేకుండానే లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. గత మార్చి 26వ తేదీన యూసుఫ్‌గూడలోని తన గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ సమయంలో కూడా పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడ్డట్లు ఆమె వెల్లడించింది. ఇష్టం లేకుండానే బలవంతంగా శారీరక వాంఛలు తీర్చుకునేవాడని ఎన్నోసార్లు వ్యతిరేకించడం జరిగిందని పేర్కొంది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా తన న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దేబాస్ దేకాపై ఐపీసీ సెక్షన్ 376, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి.. లోబర్చుకుని.. జాబ్ వచ్చాక కాదన్నాడు
సహ విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటానని శారీకరకంగా లోబరుచుకున్నాడు. తీరా ఉద్యోగం వచ్చాక తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, పెద్దలు కౌన్సెలింగ్ ఇచ్చినా వివాహానికి నిరాకరించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. రామభద్రపురం: బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన మెరుపుల నాగేంద్ర, రామభద్రపురానికి చెందిన ఓ విద్యార్థిని 2014 నుంచి బొబ్బిలి రాజాకళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో ప్రేమగా మారింది. ఉద్యోగం వస్తే వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. మూడు నెలల కిందట ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాగేంద్రకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి మే 31వ తేదీన పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేశారు. నిందితుడ్ని బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం సాలూరుకు రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై కృష్ణమూర్తితో కలసి సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు విలేకరులకు వెల్లడించారు. చదవండి: ప్రేమించి.. లోబర్చుకుని.. ఉద్యోగమొచ్చాక కాదన్నాడు -
ప్రియుడి ఇంట్లో బైఠాయింపు
వరంగల్ అర్బన్ ,ఎల్కతుర్తి: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంట్లో బైఠాయించి నిరసనకు దిగింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. దామెరకు చెందిన ప్రశాంత్‌కు, ధర్మసాగర్ మండలం దేవునూర్‌కు చెందిన ఓ యువతికి గుడిలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా ప్రశాంత్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుంది. దీంతో సదరు యువతి బంధువులతో ప్రశాంత్ ఇంటికి చేరుకుని బైఠాయించింది. న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని భీష్మించుకు కూర్చుంది. విషయం తెలుసుకున్న ఎస్సైలు గడ్డం ఉమ, టీవీఆర్ సూరి, స్వప్న సిబ్బందితో దామెరకు చేరుకుని రెండు రోజుల్లో న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి మౌనదీక్ష
పశ్చిమ గోదావరి, అత్తిలి: ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకుంటానని ఒప్పుకున్నాడు. తీరా ముహూర్తం సమయానికి ప్రేమికుడు పత్తా లేకుండా పోవడంతో యువతి ప్రియుడి ఇంటిముందు మౌనదీక్షకు దిగిన ఘటన అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు చెల్లబోయిన నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం...పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మి అదే గ్రామంలో రొయ్యల కంపెనీలో పనిచేయడానికి వెళుతుంది. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామానికి చెందిన కడలి కిషోర్ రొయ్యల కంపెనీలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఐదు నెలల క్రితం కిషోర్ తన వెంటపడి ప్రేమిస్తున్నాను అని చెప్పాడని తొలుత అంగీకరించలేదని, తర్వాత అతని నిజాయతీని చూసి తానుకూడా ప్రేమించానని తెలిపింది. అయితే తనకు నమ్మకంలేక పెళ్లిచేసుకోవాలని కోరానని, రెండు నెలలు క్రితం ఫ్యాక్టరీ వద్ద తాళికట్టాడని, ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని, రెండేళ్ల తరువాత ఇంటికి తీసుకువెళతానని అప్పటి వరకు ఎవరి ఇంటి వద్ద వాళ్లే ఉందామని చెప్పాడని తెలిపింది. గత నెల 18వ తేదీ రాత్రి కిషోర్ తన ఇంటికి రావడంతో తమ కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని పెనుమంట్ర పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పింది. అక్కడ పోలీసుల సమక్షంలో నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని కిషోర్ ఒప్పుకున్నాడని, అంగీకార పత్రంపై ఇరు కుటుంబాల పెద్దలు సంతకాలు చేశారని వెల్లడించింది. దీంతో పెద్దలు వీరికి ఈనెల 5వ తేదీన సాయంత్రం మాముడూరు వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే వివాహానికి నాగలక్ష్మి సిద్ధమవుతున్న తరుణంలో 5వ తేదీ మధ్యాహ్నం కిషోర్ కుటుంబ సభ్యులు తమ పెద్దలకు ఫోన్‌చేసి, తమ అబ్బాయి కనిపించడంలేదని తెలిపారని, దీనిపై పెనుమంట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం ప్రియుడు కిషోర్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి నాగలక్ష్మి మౌనదీక్షకు దిగింది. ప్రియుడి ఇంటికి తాళం వేసిఉండటంతో బాధితురాలు ఇంటి ముందే కూర్చుంది. తనకు న్యాయం చేయాలని, కిషోర్‌తో పెళ్లి చేసేవరకు ఇక్కడే ఉంటానని నాగలక్ష్మి పేర్కొంది. ఈసమాచారాన్ని ఆమె 100 నంబర్‌కు తెలపడంతో అత్తిలి పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. న్యాయం జరుగుతుందని, అధైర్యపడవద్దని పోలీసులు ఆమెకు భరోసా కల్పించారు. -
ప్రియుడి వంచన.. వివాహిత ఆత్మహత్యాయత్నం
కర్నూలు, బొమ్మలసత్రం: భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కానాలకు చెందిన సుబ్బ లక్ష్మమ్మ కూతురు శాంతమ్మ, అదే గ్రామానికి చెందిన రాజేష్ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి శాంతమ్మను ఓ వ్యక్తికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లైన 10 రోజులకే తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు భర్తకు చెప్పడంతో అతడు విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి విడిపోయారు. దీంతో శాంతమ్మ భర్తను వదిలి ప్రియుడి రాజేష్ వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రెండు సార్లు అబార్షన్ చేయించాడు. తనను వివాహం చేసుకోవాలని పలుమార్లు కోరినా అప్పుడు ఇప్పుడూ అంటూ దాట వేస్తూ వచ్చాడు. వారం క్రితం పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో పుట్టినింటికి చేరుకుంది. తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం ఉదయం మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో పడివుండగా తల్లి గుర్తించి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎలాగైనా తన బిడ్డకు న్యాయం చేయాలని శాంతమ్మ తల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
న్యాయం కోసం.. సెల్ టవర్ ఎక్కిన యువతి
సాక్షి, వరంగల్: తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ముఖం చాటేశాడంటూ తనకు న్యాయం చేయాలని ఏకంగా సెల్ టవర్ ఎక్కిన యువతి. ఈ ఘటన మంగళవారం జిల్లాలోని పెగడపెల్లిలో చేటు చేసుకుంది. కుటుంబ సభ్యలు, వయుతి తెలిపిన వివరాలు ప్రకారం.. పెగడపల్లికి గ్రామానికి చెందిన దామెరా మాలిక అదే ప్రాంతానికి చెందిన నక్క మహేష్ గత 9 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. యువకుడు ఇప్పుడు నీవు నాకు అవసరం లేదంటున్నాడని యువతి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేయడంతో అమె తల్లిదంద్రుడలు, కుటుంబ సభ్యలు భయందోళనకు గురవుతున్నారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన
జఫర్‌గఢ్: రెండేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగిన సంఘటన మండలంలోని హిమ్మత్‌నగర్‌లో గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుడికందుల కుమార్, స్వరూప దపంతుల కూతురు అశ్వినితో మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన మేర్గు ఎల్లగౌడ్, శోభ దంపతుల కుమారుడు మేర్గు శ్రీకాంత్ ప్రేమాయణం సాగించాడు. అశ్విని మైనర్ కావడంతో రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. అయితే గత డిసెంబర్ 31న అమ్మాయి ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవమని నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ విషయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు ఇరువర్గాలకు సంబంధించిన పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించి అశ్వినిని పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఇందుకు శ్రీకాంత్, అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో కలత చెందిన అశ్విని, కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇంటి ఎదుట నిరసన తెలుపగా మహిళలు, పలువురు కుల పెద్దలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్రియురాలు నిరసనకు దిగిన సమయంలో ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకటకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని ఆమెకు, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు శాంతించలేదు. అశ్వినికి న్యాయం జరిగే తాము ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వారు రాత్రి వరకు నిరసన కొనసాగించారు. -
ప్రేమ పేరుతో వంచన
నువ్వంటే ఇష్టమన్నాడు. నువ్వులేనిదే లేనన్నాడు. పెళ్లిపేరుతో లొంగదీసుకున్నాడు. చివరికి తాళి కట్టమంటే పత్తాలేకుండా పోయాడు. తట్టుకోలేని బాధితురాలు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదోని టౌన్: మండల పరిధిలోని కుప్పగల్ గ్రామానికి చెందిన గురుస్వామి, తిప్పమ్మ కుమారుడు బోయ శ్రీనివాసులు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి మాయ మాటలకు నమ్మి సర్వం అర్పించింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని శ్రీనివాసుల వద్ద ప్రస్తావించి, పెళ్లి చేసుకోవాలని కోరింది. నిరాకరించడంతో కుటుంబ సభ్యులతో కలిసి అతని ఇంటికి వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. చేసేదేమీ లేక వెనుదిరిగింది. మరోపక్క తల్లిదండ్రులు యువతిని మందలించారు. దీంతో మనస్తాపం చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంపై పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబును ఆరా తీయగా ప్రేమపేరుతో మోసం చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, విచారించి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు. -
రెండేళ్లు సహజీవనం కొడుకు పుట్టాక?
గోదావరిఖని(కరీంనగర్): ప్రేమించి, సహజీవ నం చేసి, కొడుకు పుట్టాక పెళ్లి చేసుకుని, ఇప్పుడు కాదంటున్నాడని ఓ మహిళ తన భర్త ఇంటి ఎదు ట ఆందోళనకు దిగింది. హనుమాన్‌నగర్‌కు చెందిన రామస్వామి తనతో రెండేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు కాదంటున్నాడని తనకు న్యాయం చేయా లని గోదావరిఖనికి చెందిన దామెర సునీత అతడి ఇంటి ఎదుట బైటాయించింది. అతన్ని నమ్మి ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం కూడా వదులుకున్నానని, ఈఏడాది చర్చిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఇప్పటికే పెళ్లిచేసుకున్న భార్య పిల్లలు వద్దంటున్నారనే కారణాన్ని సాకుగా చూపి తనకు అన్యాయం చేస్తున్నాడని, పోలీసులు న్యాయం చే యాలని వేడుకుంది. సునీత ఫిర్యాదుతో కేసును కరీంనగర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపిస్తున్నట్లు సీఐ వాసుదేవరావు వివరించారు. -
ప్రేమ పేరుతో మోసగించాడంటూ...
కామేపల్లి (ఖమ్మం): ప్రేమ పేరుతో తనను మోసగించాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి, తన బంధువులతో కలిసి మౌన దీక్షకు దిగింది. మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీ శ్రీరాంనగర్ తండాలో శనివారం ఇది జరిగింది. ఆ యువతి యువతి దరావత్ ఉమ తెలిపిన వివరాలు... కామేపల్లి మండలం శ్రీరాంనగర్ తండాకు చెందిన భూక్య నరేష్, గార్ల మండలం కోట్యానాయక్ తండాకు చెందిన దరావత్ ఉమ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని అద్దె గదిలో రెండేళ్లపాటు ఉన్నారు. నరేష్‌కు ఇటీవల వ్యవసాయ శాఖలో ఏఈఓగా ఉద్యోగమొచ్చింది. తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరింది. అతడు నిరాకరించాడు. దీంతో, ఆమె మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో తన ప్రియుడు నరేష్ ఇంటి ఎదుట, తన బంధువులతో కలిసి శనివారం మౌన దీక్షకు దిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లపాటు నమ్మించి, తనతోపాటు కలిసుండి, ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు మౌన దీక్షను కొనసాగిస్తానంది. -
రేయ్.. నేను సుప్రియను మోసం చేశా!
సాక్షి, ముంబై : ‘సుప్రియా.. నీ బాయ్ ఫ్రెండ్‌తో జాగ్రత్త!’... ఈ పోస్టు గత వారం రోజులుగా ముంబై నగరంలో చక్కర్లు కొడుతోంది. తన గర్ల్ ఫ్రెండ్‌ను మోసం చేసి వేరే అమ్మాయితో అఫైర్ కొనసాగిస్తున్న ఓ వ్యక్తి బండారాన్ని బయటపెడుతూ ఓ యువతి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. అంధేరీకి చెందిన ఐశ్వర్య శర్మ వారం రోజుల క్రితం ఓ పబ్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు ఆమె వెనకాలే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ యువకుడు ‘అరేయ్.. నేను సుప్రియను బోల్తా కొట్టించి.. నిధితో నిన్న రాత్రి బయటకు వెళ్లి ఎంజాయ్ చేశాను’ అని చెప్పాడు. దానికి మరో యువకుడు ‘సూపర్ రా...సుప్రియ ఆ విషయాన్ని కనిపెట్టలేదు’ అంటూ అన్నాడు. అయితే అది విన్న ఐశ్వర్య మాత్రం సుప్రియ నిన్ను కనిపెడుతుంది అంటూ ఓ పోస్ట్ చేసింది. ‘సుప్రియా. నీ ప్రియుడి పేరు అమన్. వాడు నిన్ను మోసం చేసి నిధితో కులుకుతున్నాడు. వాడో వెధవ (బూతులు కూడా...). నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. సుప్రియా పేరుతో ఉన్న అమ్మాయిలందరికీ విజ్ఞప్తి. మీ బాయ్‌ప్రెండ్‌లలో ఎవడైనా అమన్ పేరుతో ఉంటే... వెంటనే వాడితో బ్రేకప్ చెప్పేయండి’ అంటూ సూచించింది. ముంబైలో మీకు తెలిసిన సుప్రియలందరికీ ఈ సందేశాన్ని షేర్ చెయ్యండంటూ ఐశ్వర్య కోరింది. అప్పటి నుంచి సేవ్ సుప్రియ పేరిట యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ సుప్రియ ఆచూకీ దొరికిందో లేదో తెలీటం లేదుగానీ.. పబ్లిసిటీ కోసమే ఐశ్వర్య ఈ పోస్టు చేసిందని అనుమానం వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు. ఆ సంగతి పక్కనపెడితే... 331 షేర్లతో.. 2 వేలకు పైగా రియాక్షన్లతో ప్రస్తుతానికైతే ఈ పోస్టు దూసుకుపోతుంది. -
ప్రే‘ముంచాడు’
శ్రీకాకుళం రూరల్: నువ్వే నాకు సర్వసం అన్నాడు. నువ్వులేనిదే నేను జీవించలేనంటూ చేతిలో చెయ్యేసి ఓట్టేశాడు. అతని మాయ మాటలు నమ్మి ఓ మహిళ మోసపోయింది. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలు సైతం ప్రియుడి ప్రేమ మోజులో పడి తప్పించేసుకుంది. సర్వసం అప్పగించిన ఆమె చివరికి పెళ్లిచేసుకోమంటే ఆ మాయగాడు మొహం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం రూరల్ మండలంలోని ఇప్పిలి గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన కరణం శ్రీనువాసరావు గడచిన ఆరు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ పేరుతో ఆ అమ్మాయికి తిప్పని పార్కులు లేవు, చూపించని సినిమాలు లేవు. ప్రియుడి ప్రేమ మోజులో పడిన ఆమె శారీరకంగా కూడా తలవంచక తప్పలేదు. చివరికి పెళ్లి చేసుకోమంటే ఆ కామాంధుడు మాట మార్చేశాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ అభాగ్యురాలు న్యాయం కావాలంటూ గ్రామ పెద్దలను దపదఫాలుగా ఆశ్రయించింది. గ్రామపెద్దలు కూడా ససేమిరా అనడంతో చేసేదిలేక రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రేమికుడి మాటలకు కట్టుబడి నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని శ్రీనువాసరావు పూర్తిగా ఆ యువతికి నమ్మబలికాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలు కూడా తప్పించుకోమని ఒత్తిడిచేసినట్టు తెలిసింది. ఆయన ప్రేమమోజులో పడి వచ్చిన సంబంధాలన్నీంటిని వాయిదా వేసుకుంటూ వచ్చింది. అయితే నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, నువ్వు ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావని శ్రీనువాసరావును ఆ యువతి నెలరోజుల క్రితం నిలదీసింది. నిన్ను పెళ్లిచేసుకునే ఉద్దేశం నాకు లేదని, నీదిక్కున్న దగ్గర చెప్పుకో అంటూ తెగేసి చెప్పేశాడు. రూ. 1.50 లక్షలకు బేరం? జరిగిన అన్యాయంపై గ్రామ పెద్దలు బాధిత యువతి తరఫున మాట్లాడక పోగా చివరికి రాజీ కావాలంటూ రూ. 1.50 లక్షలకు బేరం పెట్టారు. ఈ డబ్బు తీసుకొని కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటే నీ అంతుచూస్తామని ఆ యువతిని శ్రీనువాసరావు బెదిరించినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనైనా కేసు వెనక్కి తీసుకోమని అవసరమైతే మహిళా సంఘాలతో పోరాటాలు చేస్తామంటూ ఆమె మొరాయించినట్టు తెలిసింది. అయితే ఉన్నతాధికారుల సూచనలు మేరకు వైద్య పరీక్షలు నిమిత్తం రిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతుంది. నెలరోజులుగా కేసుపై కుస్తీ ఇదిలావుండగా తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఇప్పిలి గ్రామ పెద్దలు తప్పుదోవ పట్టించేందుకు పూనుకున్నారు. రాజీ కోసం అన్ని విధాలుగా బాధితురాలి కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వీలు పడకపోవడంతో మిన్నకుండిపోయారు. పోలీసులు కూడా చేసేదేమిలేకపోవడంతో ఎట్టకేలకు ఈ నెల 26న శ్రీనువాసరావుపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. -
ప్రియుడు కోసం ప్రియురాలి మౌన దీక్ష
రేగిడి : ప్రేమించిన ప్రియుడు సంబంధం లేదంటూ వదిలేయడంతో మోసపోయిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందే బుధవారం మౌనదీక్షకు దిగింది. మండలంలో చిన్నపుర్లి గ్రామానికి చెందిన గ్రామస్తులతో పాటు బాధితురాలు అందించిన వివరాలు... గ్రామానికి చెందిన కొబగాన సాయికుమారి తన తల్లిదండ్రులు అంజమ్మ, గౌరునాయుడుతో కలిసి విజయవాడలో నివాసం ఉంటుంది. ఆరేళ్ల కిందట తన సోదరి వివాహ నిమిత్తం రేగిడి మండలంలోని స్వగ్రామమైన చిన్నపుర్లి వచ్చింది. ఇక్కడ నెల రోజులున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఎర్నేన చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. చదువుకున్న వాడు కావడంతో పాటు వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె ప్రేమలో పడింది. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో పాటు చంద్రశేఖర్ కూడా పలుమార్లు విజయవాడ వెళ్లివస్తుండేవాడు. ఈ తరుణంలో వీరి మధ్య సంబంధం మరింత పెరిగింది. అయితే గత ఏడాది నవంబరు నుంచి చంద్రశేఖర్ బాధితురాలికి ఫోన్ చేయకపోవడంతో పాటు వివాహం చేసుకోనని చెప్పేశాడు. దీంతో మోసపోయిన బాధితురాలు అప్పట్లోనే రేగిడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనకు న్యాయం జరగలేదని దీంతో గత్యంతరం లేకే తన ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్షకు దిగినట్టు పేర్కొంది. తన ప్రియుడు గ్రామంలోనే ఉన్నాడని, న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపింది. చంద్రశేఖర్ విశాఖపట్నంలోని ఓ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తున్నట్టు పేర్కొంది. విషయం తెలుసుకున్న రేగిడి స్టేషన్ ట్రైనీ ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ప్రియుడు మోసగించాడంటూ యువతి ఆత్మహత్యాయత్నం
టెక్కలి: ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ శనివారం ఓ యువతి ఆత్మహత్యకు యత్ని ంచింది. రైలు పట్టాల వద్ద కూర్చుని రోదిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించడంతో ప్రమాదం నుంచి బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం తెంబూరుకి చెందిన ఓ యువతి టెక్కలిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం మధ్యలో మానేసింది. మొదటి సంవత్సరంలో ఉండగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పాతపట్నంకు చెందిన పాడి దిలీప్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి కళాశాలకు వెళ్లి వచ్చేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికి దిలీప్‌కుమార్ ఆ యువతిని గర్భవతిని చేశాడు. యువతి పెళ్లి చేసుకోవాలని గట్టిగా అగడంతో అందుకు నిరాకరించాడు. ఆమెకు కనిపించకుండా పరారయ్యాడు. ఈ విషయం ఆ యువతి ఇంట్లో తెలియజేసింది. వారు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందాం అని శనివారం టెక్కలి గోపినాథపురం సమీపంలో రైల్వే పట్టాల వద్దకు వచ్చి రోదిస్తోంది. అదే సమయంలో రైలు వస్తుండడం.. ఆ యువతి తీవ్రంగా రోదిస్తుండడంతో స్థానికుడు ఒకరు గమనించి స్థానికుల సహాయంతో ఆ యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఏం జరిగిందని ఆరా తీసి పోలీసులకు అప్పగించారు. టెక్కలి ఎస్ఐ రాజేష్ బాధితురాలితో కలసి పాతపట్నం వెళ్లి అక్కడ వివరాలు సేకరించారు. ఆ యువకుడు అందుబాటులో లేకపోవడంతో అతని కోసం గాలింపునకు చ ర్యలు తీసుకున్నారు. బాధితురాలిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని సూచిం చారు. దిలీప్‌కుమార్ దొరికిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని పోలీసులు ఓ యువతికి హామీ ఇచ్చారు.