Boyfriend Cheated Girlfriend And Threatening With Photos In Banjara Hills Hyderabad - Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో దారుణం: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ఇప్పుడు నగ్న ఫొటోల్ని..

Published Thu, Jun 22 2023 2:03 PM | Last Updated on Thu, Jun 22 2023 2:55 PM

Boyfriend Cheating Girlfriend In Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యూడ్‌ వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై బాధితురాలుఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌.ఎన్‌.నగర్‌లో నివసించే యువతికి అదే ప్రాంతంలో నివసిస్తున్న దెబాస్‌ దేకా(27)తో గతేడాది అక్టోబర్‌లో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అప్పటి వరకు సహజీవనంతో కలిసి ఉందామని నమ్మించాడు. తరచూ ఆమెకు ఇష్టం లేకుండానే లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. గత మార్చి 26వ తేదీన యూసుఫ్‌గూడలోని తన గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ సమయంలో కూడా పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడ్డట్లు ఆమె వెల్లడించింది.

ఇష్టం లేకుండానే బలవంతంగా శారీరక వాంఛలు తీర్చుకునేవాడని ఎన్నోసార్లు వ్యతిరేకించడం జరిగిందని పేర్కొంది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా తన న్యూడ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దేబాస్‌ దేకాపై ఐపీసీ సెక్షన్‌ 376, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement