టెక్కలి రూరల్: వివాహమై ఎనిమిదేళ్లయినా తన భర్త బంగారం పుస్తెల తాడు చేయించలేదని మనస్తాపానికి గురైన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కోట»ొమ్మాళి మండలం భావాజీపేట గ్రామంలో చోటుచేసుకోగా పంగ సత్యవతి (30) ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం గేదెలవానిపేట గ్రామానికి చెందిన సత్యవతికి ఎనిమిదేళ్ల క్రితం భావాజీపేటకు చెందిన సూర్యనారాయణతో వివాహమైంది. శుక్రవారం రాత్రి కూడా ఇరువురి మధ్య పుస్తెలతాడు విషయమై గొడవ జరిగింది.
మనస్తాపానికి గురైన సత్యవతి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శనివారం ఉదయం సూర్యనారాయణ నిద్ర లేచేసరికి సత్యవతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. కోటబొమ్మాళి ఎస్సై రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి చల్ల రత్నాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సత్యవతికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment