
టెక్కలి : పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే కోపంతో ఓ వివాహిత వారికి చుక్కలు చూపెట్టింది. అరెస్టైన భర్తను బెయిల్‌పై విడుదల చేయడంతో వీరంగం సృష్టించింది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేసింది. ఈ ఘటన టెక్కలి పోలిస్‌స్టేషన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. పాతపట్నానికి చెందిన వందనాదేవి, భవానీపురానికి నాగరాజు దంపతులు. వీరి మధ్య గత ఐదేళ్లుగా కుటుంబ వివాదాల కేసు నడుస్తోంది. ఈకేసులో నాగరాజుకు అరెస్టు వారెంట్ జారీ చేసి టెక్కలి పోలిస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే, అరెస్టు చేసిన వెంటనే నాగరాజును విడిచిపెట్టారనే కోపంతో దేవి రెచ్చిపోయింది. పోలిస్‌స్టేషన్ అద్దాలు పగులగొట్టి రోడ్డుపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment