సాక్షి, వైజాగ్ : సచివాలయ ఉద్యోగాల నియామకాలపై పలు ప్రాంతాలలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అధ్యక్షతన విశాఖలోని అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాగార్జున మాట్లాడుతూ.. సచివాలయ నియామకాలను ఓర్వలేక టీడీపీ, ఏబీఏన్ రాధాకృష్ణ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లోనే సీఎం జగన్ నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ప్రశంసించారు. గత ఐదేళ్లో టీడీపీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, వీఎమ్‌ఆర్‌డీ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి కాంతారావు, విద్యార్థి నాయకులు మోహన్, కళ్యాణ్, క్రాంతి కిరణ్, ఎస్సీ సెల్ నాయకులు రొయ్య వెంకట రమణ పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగాలతో ఉపాధి కల్పించింనందుకు హర్షం వ్యక్తం చేస్తూ టెక్కలిలో యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం పై హర్షం వ్యక్తం చేస్తూ..వైఎస్సార్ జిల్లాలోని కోటిరెడ్డి కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిర్ బెలూన్లను ఎగురవేసి జై జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ కార‍్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నిత్యానంద రెడ్డి, పులి సునీల్ కుమార్, పాకా సురేష్ ఇతర నేతలు పాల్గొన్నారు.
‘సచివాలయ’ నియామకాలపై విద్యార్థుల భారీ ర్యాలీ
Published Mon, Sep 23 2019 2:23 PM | Last Updated on Mon, Sep 23 2019 2:29 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment