రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటం ఢిల్లీ పెద్దలను కదిలించేలా ఈ నెల 10న ఢిల్లీలో నిర్వహించనున్న
టెక్కలి: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటం ఢిల్లీ పెద్దలను కదిలించేలా ఈ నెల 10న ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. ధర్నా పోస్టర్‌ను పార్టీ నాయకుల సమక్షంలో టెక్కలిలో గురువారం ఆవిష్కరించారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై వైఎస్సార్ సీపీ మొదటి నుంచి పోరాడుతోందన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు ప్రతీ నియోజకవర్గం నుంచి 15మంది కీలక కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. 7న అనకాపల్లిలో రాత్రి 10 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్, మండల కన్వీనర్ బి.గౌరీపతి, యువజన విభాగం ప్రతినిధి బగాది హరి, జిల్లా ప్రతినిధి తిర్లంగి జానకిరామయ్య, పార్టీ నాయకులు చింతాడ గణపతి, రెడ్డి మాష్టార్, ఎస్.సత్యం, ధర్మారావు, టి.కిరణ్ పాల్గొన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే...
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తెప్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నా పోస్టర్‌ను ఆమె గురువారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఐదేళ్లు చాలదు పదేళ్లు కావాలన్న అప్పటి ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడు ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చేసరికి మాట మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రజల పక్షాన పోరాడేందుకు ‘ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు’ నినాదంతో ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, పార్టీ నాయకుడు మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఢిల్లీ ధర్నాకు వెళ్లే నేతలు ఏడో తేదీ రాత్రి 8 గంటలకు అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలని తెలిపారు. పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నర్తు రామారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, పార్టీ నాయకులు కోణార్క్ శ్రీను, పాలిశెట్టి మల్లిబాబు, ఊన లక్ష్మణ్ పాల్గొన్నారు.