టెక్కలి ఆస్పత్రి ముందు ధర్నా చేస్తున్న మృతురాలి బంధువులు, లక్ష్మి(ఫైల్)
టెక్కలి రూరల్/నందిగాం : టెక్కలి ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలు శార్వాణీ చేసిన శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. శనివారం ఉదయం నుంచి ఆస్పత్రి ఎదు ట ధర్నా చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించడంతో సుమారు 5 గంటల పాటు ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఉద్రి క్తత తారా స్థాయికి చేరుకునే లోపు ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, డా క్టర్‌లు, సంఘం నాయకులతో, మృతురాలి బం ధువులతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి బం ధువులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి తారకరావుకు నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన గుర్రల వాసు కుమార్తె లక్ష్మి(24)కి సుమారు ఐదేళ్ల కిందట వివాహమయింది. వీరికి మూడేళ్ల కుమారుడు రుత్విక్ ఉన్నాడు. అయితే లక్ష్మి రెండో కాన్పు నిమిత్తం తన అత్తవారింటి నుంచి కన్నవారింటికి పాలవలస వచ్చింది. గురువారం ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
డాక్టర్ శార్వాణీ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11 గంటలకు శస్త్రచికిత్స చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి. అనంతరం డాక్టర్ ఈమెకు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స కూడా పూర్తిచేసి తల్లీ పిల్లలు బాగున్నారని భావించి ప్రసూతి విభాగానికి తరలించా రు. వారిని వార్డుకు తరలించే క్రమంలో అక్కడే ఉన్న కిందిస్థాయి సిబ్బంది శస్త్రచికిత్స ఖర్చులు నిమిత్తం రూ. 2100 తీసుకున్నట్టు లక్ష్మి అన్నయ్య గుర్రాల గణపతి తెలిపారు. అయితే అక్కడికి కొంత సమయం తర్వాత సాయంత్రం 4 గంటలకు లక్ష్మికి బ్లీడింగ్(రక్తం) అవుతుందని తన సోదరుడు గుర్రాల గణపతి నర్సులకు చెప్పగా, వారు మీరు మాకు చెప్పడం ఏమిటి... ముందు మీరు బయటకు నడవండి.. మీరు ఇక్కడ ఉండకూడదు అని తూలనాడారు. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. ఆమెకు ఏమి అవ్వదు మాకు తెలుసు అని చెబుతూ రక్తాన్ని గుడ్డతో తుడిచేశారు.
బ్లీడింగ్ మరీ ఎక్కువవడంతో డాక్టర్ శార్వాణీకి సమాచారం ఇవ్వడంతో ఆమె లక్ష్మికి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి మందులు ఇచ్చారు. తర్వాత ఆస్పత్రిలో ఏబీ పాజిటివ్ రక్తం లేకపోవడం, లక్ష్మి బీపీ డౌన్ అవ్వడంతో సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చేరిన తర్వాత లక్ష్మి మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, భర్త తారకరావు, సోదరుడు గణపతి టెక్కలి ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. టెక్కలి ఆస్పత్రిలోని నర్సులు, వైద్యులు కలిసే లక్ష్మిని చంపేశారని, పిల్లలను అనాథలను చేశారని వాపోయారు. మృతదేహాన్ని పట్టుకుని టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అర్ధరాత్రి 12 గంటలు దాటింది తెల్లవారి ఫిర్యాదు ఇవ్వండి అని పోలీసులు అనడంతో వారు వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం నుంచే మృతురాలి కన్నవారు ఊరు పాలవలస, అత్తవారి ఊరు సువర్ణపురం గ్రామస్తులు, నాయకులు తదితరులతో కలిసి ఆస్పత్రి గేటు ముందు ధర్నాకు దిగారు.
సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో టెక్కలి సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అనంతరం టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, తాహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కణితి కేశవరావు, జనసేన నాయకుడు యాదవ్, దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ చల్ల రామారా>వు, దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు బొకర నారాయణరావు, కేఎన్‌పీఎస్ నాయకులు బెలమర ప్రభాకరరావు, ఈశ్వరరావు కలిసి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వైద్యం అందించి లక్ష్మి మృతికి కారణమైనందుకు వైద్యులు, వైద్య సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు సమస్యను పరిష్కరించారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జ రుగుతున్న ఆం దోళనను తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ రాఘవ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, బాధితుల నుంచి సమాచారం అడిగితెలుసుకున్నారు.
బాధితులకు అందించే సౌకర్యాలు
మృతురాలు లక్ష్మికి చెందిన ఇద్దరు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించేవిధంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలు పేరు మీద నందిగాం మండల కేంద్రంలో రెండు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలం ఎక్కడైన గుర్తించినట్టు అయితే ఎకరా పొలం, చంద్రన్న బీమా ఉంటే వచ్చేలా కృషిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా తక్షణ సహా యం కింద బాధిత కుటుం బానికి రూ. 40 వేలు ఆర్థిక సహాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment