సమైక్యాంధ్ర సాధించేవరకు పోరాటం | Samaikyandhra Movement completion of 100 days TEKKALI | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర సాధించేవరకు పోరాటం

Published Fri, Nov 8 2013 3:28 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

Samaikyandhra Movement  completion of 100 days TEKKALI

టెక్కలిరూరల్, న్యూస్‌లైన్:    ప్రాణాలైనా అర్పిస్తాం... సమైక్యాంధ్రను సాధిస్తామంటూ ఉపాధ్యాయ, ఎన్‌జీవో, కార్మిక  జేఏసీ నాయకులు నినదించారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై గురువారంతో 100 రోజులు పూర్తయిన సందర్భంగా టెక్కలి అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా, మానవహారం నిర్వహించారు. సమైక్య నినాదాలు వినిపించారు. రాష్ట్ర విభజనకు కుట్రలు చేస్తున్న నాయకులారా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. విభజిస్తే ఊరుకోమని, శ్రీ కృష్ణ కమిటీ నివేదికను తక్షణమే అమలు చేయాలని నినదించారు.
 
 సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు మద్దతిస్తున్న మంత్రులంతా తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో విభజన పరులకు బుద్ధిచె బుతామని శపథం చేశారు. సమైక్యాం ధ్రతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, సూపరింటెండెంట్ శ్యామల, ఏవో విజయకుమార్, జేఏసీ నాయకులు సంపతిరావు మోహనరావు, బసవల ధనుంజయరావు, సత్తారు కోటేశ్వరరావు, చమళ్ల భాస్కరరావు, బాడాన నారాయణరావు, నేతాజీ, ఆర్.శేషు, భూషణం, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు చింతాడ గణపతి, ఎస్.రాజా తదితరులతో పాటు సమైక్యవాదులంతా పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement