తెలంగాణ బిల్లును నిరసిస్తూ
రోడ్డెక్కిన ఉద్యోగులు
మద్దతుగా కదం తొక్కిన విద్యార్థులు
రెండో రోజూ మూతపడిన కార్యాలయాలు
స్తంభించిన పాలన
ఏలూరు, న్యూస్‌లైన్:
తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరింది. దాదాపుగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయూలన్నీ మూతపడ్డారుు. దీంతో పాలన స్తంభించింది. ఏలూరు సహా అన్ని పట్టణాల్లోనూ ఎన్జీవోలు, ఉద్యోగులు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిం చారు. పలుచోట్ల విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఉద్యోగులతో కలసి కదం తొక్కార్జు. ఏలూరు ఎన్జీవోలు కళా జాతాలు, డప్పు వారుుద్యాల సందడి నడుమ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంగణంలో గల అన్ని విభాగాల్లోకి వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించివేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాలకు ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్, అసోసియేషన్ ప్రతినిధులు ఆర్‌ఎస్ హరనాథ్, చోడగిరి శ్రీనివాస్, పి.సోమశేఖర్, రమేష్‌కుమార్, నర సింహమూర్తి నాయకత్వం వహించారు.
ఆకివీడులో ఎన్జీవోలు రాస్తారోకో చేసి ప్రభుత్వ కార్యాలయాలను మూ రుుంచివేశారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యు డు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వారికి సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెంలో ఎన్జీవోలు ర్యాలీ, మానవహారం చేశారు. నరసాపురంలో ఎన్జీవోలు పంచాయతీరాజ్, ముని సిపాలిటీ, సబ్ ట్రెజరీ కార్యాలయాలను మూరుుంచివేశారు. సమ్మెలో లేని ఆ శాఖల ఉద్యోగులను బయటకు పంపించివేశారు. నిడదవోలులో ఎన్జీవోలు మానహారం ఏర్పాటు చేశారు. అనంత రం ర్యాలీ నిర్వహించారు. తహసిల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలను ముట్టడించారు. భీమవరం జువ్వలపాలెం రోడ్డులో చైతన్య కళాశాల విద్యార్థులు రాస్తారోకో జరి పారు. ఎన్జీవోలు ప్రకాశం చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు. తణుకులో మునిసిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ చేసి ధర్నా నిర్వహించారు. ఎన్జీవోలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాలకొల్లు లాకుల సెంటర్‌లో ఎన్జీవోలు రాస్తారోకో చేసి నిరసన గళమెత్తారు. ఇరిగేషన్, ఎంపీడీవో కార్యాలయాల్లోని ఉద్యోగులను బయటకు పంపించివేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు, వైఎస్సార్ సీపీ నాయకులు ముచ్చెర్ల శ్రీరామ్ పాల్గొన్నారు. కొవ్వూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు ధర్నా చేశారు. తాళ్లపూడిలో నిరసన ప్రదర్శన జరిగింది.
ఉద్యమ బావుటా
Published Sat, Feb 8 2014 2:29 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement