
సాక్షి, టెక్కలి : విధుల్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తనకు గుండెపోటు వచ్చినా ఎంతో చాకచక్యంగా బస్సును పొలాల్లోకి తీసుకెళ్లి నిలిపివేసి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ఖమ్మం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టెక్కలి దగ్గరకు వచ్చే సరికి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పొలాల్లోకి దింపి మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులకు స్పల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment