
‘ఈ కథలో పాత్రలు కల్పితం’ హీరో పవన్ తేజ్ కొణిదెల
టెక్కలి/శ్రీకాకుళం: ఒకప్పుడు విద్యార్థిగా ఆ కాలేజీ అంతా తిరిగిన కుర్రాడు.. డైరెక్టర్‌గా మారాడు. ఎక్కడ తన కలలకు పునాదులు వేసుకున్నాడో అక్కడకే వచ్చి తన ప్రయాణ అనుభవాలను పంచుకున్నాడు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ యూనిట్ సందడి చేసింది. హీరో కొణిదెల పవన్ తేజ్, హీరోయిన్ మేఘనతో పాటు డైరెక్టర్ మెట్ట అభిరామ్ విద్యార్థులతో మాట్లాడారు. డైరెక్టర్ ఇదే కాలేజీలో 2012–16లో ట్రిపుల్ ఈ పూర్తి చేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినీ కెరీర్‌కు ఆదిత్య కాలేజీ ఓ వేదికగా నిలిచిందన్నారు. లీడర్‌షిప్ ఫౌండేషన్ విభాగం తనను ఎంతో ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తన మొదటి సినిమా మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన పవన్‌తేజ్‌తో చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం తరఫున సినిమా బృందానికి జ్ఞాపికలను అందజేశారు.
ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రం నటీనటులు, డైరెక్టర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న కళాశాల యాజమాన్యం
మెగా ఆశీస్సులతో..
అరసవల్లి: మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని హీరో కొణిదెల పవన్‌తేజ్ అన్నారు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా యూనిట్ సభ్యులు సోమవారం అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన డైరెక్టర్‌తో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 19న సినిమా రిలీజ్ చేస్తున్నామని డైరెక్టర్ అభిరామ్ తెలిపారు.
చదవండి: అప్పుడు డిప్రెస్ అయ్యా!
Comments
Please login to add a commentAdd a comment