పేరాడ తిలక్, అచ్చెన్నాయుడు
సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ఉత్కంఠతకు నేటితో తెరపడనుంది. నేడు జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల బలా బలాలు నిరూపించుకోనున్నారు. టెక్కలి నియోజకవర్గంలో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున పేరాడ తిలక్(ఫ్యాన్), టీడీపీ అభ్యర్థిగా కింజరాపు అచ్చెన్నాయుడు(సైకిల్), కాంగ్రెస్ నుంచి చింతాడ దిలీప్(హస్తం), బీజేపీ తరఫున హనుమంతు ఉదయ్‌భాస్కర్(కమలం), జనసేన అభ్యర్థిగా కణితి కిరణ్‌కుమార్(గాజు గ్లాసు), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి చంద్రశేఖర్‌పట్నాయక్(సింహం), స్వతంత్ర అభ్యర్థులుగా గూట్ల కాంచన (వజ్రం), గెడ్డవలస రాము(హెలికాప్టర్) తదితర అభ్యర్థులు ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్, టీడీపీ తరఫున పోటీ చేస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడు మధ్య పోటీ నెలకొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీకి అనుకూలత ఉండడంతో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు ఓటమి ఖాయం అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఆయా అభ్యర్థుల్లో ఉత్కంఠత మరింత పెరుగుతోంది.
మొత్తం ఓట్లు...
టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో మొత్తం 316 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,22,222 మంది ఓటర్లు ఉన్నారు. 157 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 2349 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 346 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు.
నియోజకవర్గంలో మండలాల వారీగా ఓటర్లు
మండలం | మొత్తం | పురుషులు | మహిళలు | ఇతరులు |
టెక్కలి | 58,762 | 29,165 | 29,592 | 05 |
నందిగాం | 47,790 | 24,391 | 23,390 | 09 |
సంతబొమ్మాళి | 56,337 | 28,533 | 27,802 | 02 |
కోటబొమ్మాళి | 59,333 | 30,004 | 29,326 | 03 |
Comments
Please login to add a commentAdd a comment