సాక్షి, టెక్కలి: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. టెక్కలి నియోజకవర్గ నేత పైలా రమేష్ సోమవారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. తనతో పాటు 20 వేల మంది కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు టిక్కెట్ ఇస్తానని మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.
నామినేషన్ వేయడానికి వారం ముందు పోటీకి సిద్ధంగా ఉండాలని, ఏర్పాట్లు చేసుకోవాలని చేప్పిన అధిష్టానం రాత్రికి రాత్రే వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చిందని వెల్లడించారు. అధిష్టానానికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని వాపోయారు. మనస్తాపం చెంది జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పైలా రమేష్ తెలిపారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశమై, ఏ పార్టీలో చేరేది నిర్ణయిస్తానని చెప్పారు. కాగా, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా కణితి కిరణ్‌కుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: అరె సాంబా... రాసుకో...)
పిఠాపురంలోనూ...
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జనసేన పార్టీ నాయకుడు అనిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో 150 మంది కార్యకర్తలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెండెం దొరబాబు సాదర స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment