కోల్ కతా:మహిళలపై మృగాళ్ల ఆకృత్యాలు శృతిమించుతూనే ఉన్నాయి. మహిళ భద్రతకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలో రోజూ ఏదో మూలన అత్యాచారాలు, లైంగిక వేధింపులు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిని టాక్సీ డ్రైవర్ లైంగిక వేధించిన ఘటన కోల్ కతా నగరంలో ఆదివారం చోటు చేసుకుంది.
చిన్ గ్రిఘాటాకు దగ్గరలో మీటర్ పై టాక్సీ మాట్లాడుకుని వెళుతున్న మహిళా ప్రయాణికురాలిని డ్రైవర్ లైంగికంగా వేధించాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ దూషించసాగాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని బాసంతి హైవే వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణలో అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.