తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో రైతు భరోసాపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. తమది చంద్రబాబులా మోసం చేసే ప్రభుత్వం కాదని, రైతుల కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. పంటలకు ప్రకటించిన గిట్టుబాటు ధర గురించి.. ఏ పంటకు ఎంత రేటో మరోసారి గురువారం పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తామన్నారు.