YSR Rythu Bharosa 2022 2nd Phase: CM Jagan Speech Highlights In Allagadda Public Meeting - Sakshi
Sakshi News home page

బాబు, కరువు రెండూ కవల పిల్లలు: సీఎం జగన్‌

Published Mon, Oct 17 2022 12:38 PM | Last Updated on Mon, Oct 17 2022 4:20 PM

YSR Rythu Bharosa 2022: CM Jagan Speech In Allagadda Public Meeting - Sakshi

సాక్షి,  నంద్యాల జిల్లా: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ఆళ్లగడ్డ నుంచి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం రెండో విడత సాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని, ప్రతి అంశంలో అండగా ఉంటున్నామన్నారు.

‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్‌ ప్రకారం ప్రతి కుటుంటానికి అండగా ఉంటున్నాం.  రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది. రూ.13,500 సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం.  ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు’’ అని సీఎం జగన్‌ అన్నారు.

ఇప్పటికే మేలో రూ.7,500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4వేలు ఇస్తున్నాం. మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ. 25,971 కోట్ల మేర లబ్ధి కలిగింది. మొత్తం 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకు రూ.51 వేలు అందించాం. పట్టాలు ఉన్న  రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం. మూడున్నరేళ్లలో కేవలం రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఒక మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు హయాంలో ఏటా కరువే. బాబు, కరువు రెండూ కవల పిల్లల అన్నట్లు పాలన సాగింది’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘అక్టోబర్ 12 వరకు సాధారణం కంటే 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. గతంలో సగటున 1.54 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే.. ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 167. 24 లక్షల టన్నులకు చేరింది. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు’’ అని సీఎం అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement