సీఎం జగన్ ఆళ్లగడ్డ పర్యటన.. అప్‌డేట్స్
12:49PM
రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్
50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు విడుదల చేసిన సీఎం జగన్
12:11PM
సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
- రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
- ప్రతి అంశంలో రైతులకు అండగా ఉంటున్నాం
- ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నాం
- రైతులకు ఇంత తోడుగా ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు
- క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నాం
- రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది
- 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది
- రైతన్నత ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం
- మూడు విడతల్లో ప్రతి రైతుకు రూ. 13,500 సాయం అందిస్తున్నాం
- ఎక్కడా లంచాలు లేవు.. వివక్ష లేదు
- ఇప్పటికే మేలో రూ. 7500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4 వేలు ఇస్తున్నాం
- మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ.25, 971 కోట్ల మేర లబ్థి
- మొత్తం 50 లక్షల మంది ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశాం
- ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకూ రూ. 51 వేలు అందించాం
- పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం
- మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
- మూడున్నరేళ్లలో రైతన్నల కోసం రూ. 1.33లక్షల కోట్లు ఖర్చు చేశాం
- మంచి పనులు ఎల్లో మీడియాలో రావు
- ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయింది
- ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయి
- గతంలో డీపీటీ పథకం.. దోచుకో, పంచుకో, తినుకో
- ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనఫిట్ ట్రాన్స్‌ఫర్ అమలవుతోంది
- గజదొంగల ముఠా మంచిని చెప్పదు.. కుట్రలే చేస్తుంది
- అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పండి
- చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి
- అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేది
- ఈరోజు మీ జీవితాలు బాగున్నాయా.. లేదా అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి
- రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు
- ఈ ప్రభుత్వంతో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు
- సున్నా వడ్డీ కింద చంద్రబాబు రూ. 685 కోట్లు చెల్లిస్తే, మూడున్నరేళ్లల్లో సున్నా వడ్డీ కింద రూ. 1,282 కోట్లు చెల్లించాం
- బాబు హయాంలో బ్యాంకుల ద్వారా రూ. 3.6 లక్షల కోట్లు ఇస్తే ఇప్పుడు రూ. 5.48 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం
- 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 6,684 కోట్లె బీమా సొమ్ము జమ చేశాం
- ఏ రైతు నష్టపోకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం
- దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి
- భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి
11:53AM
మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రసంగిస్తూ..
- సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారు
- క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం అందిస్తున్నారు.
- దేశంలోనే లేని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల భీమా
- రైతులతో వ్యవసాయం సలహా మండలి ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏపీ
- టీడీపీ హయాంలో రైతుల పేరిట దోచుకున్నారు
- మేం వచ్చాక దళారుల ప్రమేయం లేకుండా రైతులకు రాయితీ
- ఏపీ వ్యవసాయం రంగం చర్యలను ఆస్ట్రేలియా ప్రతినిధులు ప్రశంసించారు
- ప్రపంచంలోనే లేని వ్యవసాయ సంస్కరణలు ఏపీలో ఉన్నాయని వారు కొనియాడారు
11: 20AM
ఆళ్లగడ్డ చేరుకున్న సీఎం జగన్
10:10AM
► వైఎస్‌ఆర్ రైతు భరోసా నగదు జమ కార్యక్రమం.. కాసేపట్లో ఆళ్లగడ్డకు చేరుకోనున్న సీఎం జగన్.
9:03AM
► వైఎస్‌ఆర్ రైతు భరోసా రెండవ విడుత నగదు జమ కార్యక్రమం కోసం.. తాడేపల్లి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు బయలుదేరారు సీఎం జగన్.
► వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే కార్యక్రమానికి హాజరై బహిరంగ సభలో ప్రసంగించి.. అనంతరం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు.
► వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు.
► వైఎస్‌ఆర్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయం అందజేస్తున్నారు.
► మే నెలలో ఖరీఫ్‌కు ముందే తొలి విడత సాయాన్ని అందజేసింది.
► మూడో విడుతను సంక్రాంతి సమయంలో విడుదల చేయనుంది.
► తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే.. ఇప్పటివరకు ఒక్క వైఎస్‌ఆర్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర ఏపీ రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment