
సాక్షి, కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తొమ్మిదో రోజు బుధవారం షెడ్యూల్ విడుదలైంది. ఆళ్లగడ్డ మండలంలోని కృష్ణాపురంలో బుధవారం ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఆయన ఆళ్లగడ్డ మండలం పెద్దకోటకందుకూరు చేరుకొని.. పార్టీ జెండాను ఎగరవేస్తారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.3 గంటలకు పలసగారాం చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఆళ్లగడ్డ మండలం ఫోర్‌రోడ్ జంక్షన్‌లో బహిరంగ సభ ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ బస చేస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment