మంటలు చెలరేగి కారులోనే సజీవదహనం | Three burnt alive while catch caught fire | Sakshi
Sakshi News home page

మంటలు చెలరేగి కారులోనే సజీవదహనం

Published Mon, Sep 18 2017 8:52 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

Three burnt alive while catch caught fire

సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బత్తలూరు వద్ద 40వ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వైపు వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న మట్టికుప్పలను ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు సజీవదహనమయ్యారు.

తీవ్రంగా గాయపడిన రాజాప్రసాద్‌ను నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ప్రొద్దుటూరుకు చెందిన వనితాబాయి, పిల్లలు ప్రేమ్‌కుమార్‌(5), ఉమేష్‌(2)లుగా గుర్తించారు. ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement