సాక్షి, కర్నూలు : ఓ వికలాంగుడిపై మంత్రి భూమా అఖిల ప్రియ అనుచరులు దాడికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దస్తగిరి అనే వికలాంగుడిని మంత్రి అనుచరులు దాడి చేసి గాయపరిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మంత్రి అఖిల ప్రియ కాన్వాయ్ నుంచి దిగిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న అతడిపై దాడి చేశారు. తనపై చాకలి శ్రీను, మార్క్, కే రామ్‌మోహన్ మరో ముగ్గురు వ్యక్తులు కలిసి దాడి చేశారని, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు పట్టించుకోకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment