టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో అగ్రనటుడిగా పేరు పొందిన మోహన్‌బాబు తనయుడిగా తనదైన నటనతో సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాదిలో మంచు మనోజ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మంచు లక్ష్మీ వివాహంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది.
(ఇది చదవండి: శరీరమంతా స్క్రూలు, రాడ్‌లు.. బతకడం కష్టమేనన్నారు: నటి)
అయితే ఇప్పటికే మౌనికకు పెళ్లికాగా.. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. పెళ్లి సమయంలోనే మంచు మనోజ్ ఆ పిల్లవాడి బాధ్యత కూడా తనదేనని గొప్ప మనసును చాటుకున్నారు. కలిసొచ్చే కాలానికి.. ఎదిగొచ్చే కుమారుడు అంటూ అప్పట్లో మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా మౌనిక కుమారుడు ధైరవ్ నాగి రెడ్డి బర్త్ డే కావడంతో మనోజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ కాగా.. ఆయన ఫ్యాన్స్ సైతం బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మంచు మనోజ్ ట్వీట్‌లో రాస్తూ..' ఈ పవిత్రమైన రోజున నాకు అమూల్యమైన నిధిని బహుమతిగా ఇచ్చినందుకు నేను శివునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నువ్వు నా ధైర్యం ధైరవ్. నా ప్రపంచంలోకి మీరు రావడం కేవలం ఒక సంఘటన కాదు. ఇది నన్ను మంచి మనిషిగా మార్చిన ప్రయాణానికి నాంది. నేను ప్రతిరోజూ ఎంతో ఆరాధించే ప్రయాణం. నీ నవ్వు, నీ అమాయక కళ్లు నాకు మార్గదర్శక దీపాలు. నా జీవితంలో నీ ఉనికి, అమ్మ భూమా మౌనిక ప్రేమ నాకు జీవితాన్ని చాలా భిన్నమైన మార్గంలో అర్థం చేసుకునేలా చేశాయి.
మనోజ్ ట్వీట్‌లో రాస్తూ..'నీ ముసిముసి నవ్వులు, కౌగిలింతల వెచ్చదనం లేని జీవితాన్ని ఊహించలేను. మీ ఉనికి నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసింది. నా హృదయాన్ని అపరిమితమైన ఆనందంతో నింపింది. నా ప్రియమైన బంగారం ధైరవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అడుగడుగునా నీ చేయి పట్టుకుని వెంట నడుస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఉంది. నువ్వు జీవితంలో మరింత ఎదగాలని నేను ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఆగస్టు 1న ధైరవ్ నాగిరెడ్డి 5వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది చూసిన ఆయన అభిమానులు సైతం ధైరవ్ నాగిరెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
(ఇది చదవండి: మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్! )
On this auspicious day, I thank Lord Shiva for gifting me an invaluable treasure, you, my brave boy #Dhairav . Your entrance into my world wasn't just an event, it was the beginning of a journey that has made me a better man, a journey that I cherish every single day.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 1, 2023
Your… pic.twitter.com/HhUvAKbIFH
Comments
Please login to add a commentAdd a comment