bhuma family
-
మీరు నా జీవితంలోకి రావడం నా ప్రయాణానికి నాంది: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో అగ్రనటుడిగా పేరు పొందిన మోహన్‌బాబు తనయుడిగా తనదైన నటనతో సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాదిలో మంచు మనోజ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మంచు లక్ష్మీ వివాహంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. (ఇది చదవండి: శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి) అయితే ఇప్పటికే మౌనికకు పెళ్లికాగా.. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. పెళ్లి సమయంలోనే మంచు మనోజ్ ఆ పిల్లవాడి బాధ్యత కూడా తనదేనని గొప్ప మనసును చాటుకున్నారు. కలిసొచ్చే కాలానికి.. ఎదిగొచ్చే కుమారుడు అంటూ అప్పట్లో మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా మౌనిక కుమారుడు ధైరవ్ నాగి రెడ్డి బర్త్ డే కావడంతో మనోజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ కాగా.. ఆయన ఫ్యాన్స్ సైతం బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మంచు మనోజ్ ట్వీట్లో రాస్తూ..' ఈ పవిత్రమైన రోజున నాకు అమూల్యమైన నిధిని బహుమతిగా ఇచ్చినందుకు నేను శివునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నువ్వు నా ధైర్యం ధైరవ్. నా ప్రపంచంలోకి మీరు రావడం కేవలం ఒక సంఘటన కాదు. ఇది నన్ను మంచి మనిషిగా మార్చిన ప్రయాణానికి నాంది. నేను ప్రతిరోజూ ఎంతో ఆరాధించే ప్రయాణం. నీ నవ్వు, నీ అమాయక కళ్లు నాకు మార్గదర్శక దీపాలు. నా జీవితంలో నీ ఉనికి, అమ్మ భూమా మౌనిక ప్రేమ నాకు జీవితాన్ని చాలా భిన్నమైన మార్గంలో అర్థం చేసుకునేలా చేశాయి. మనోజ్ ట్వీట్లో రాస్తూ..'నీ ముసిముసి నవ్వులు, కౌగిలింతల వెచ్చదనం లేని జీవితాన్ని ఊహించలేను. మీ ఉనికి నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసింది. నా హృదయాన్ని అపరిమితమైన ఆనందంతో నింపింది. నా ప్రియమైన బంగారం ధైరవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అడుగడుగునా నీ చేయి పట్టుకుని వెంట నడుస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఉంది. నువ్వు జీవితంలో మరింత ఎదగాలని నేను ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఆగస్టు 1న ధైరవ్ నాగిరెడ్డి 5వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది చూసిన ఆయన అభిమానులు సైతం ధైరవ్ నాగిరెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్! ) On this auspicious day, I thank Lord Shiva for gifting me an invaluable treasure, you, my brave boy #Dhairav . Your entrance into my world wasn't just an event, it was the beginning of a journey that has made me a better man, a journey that I cherish every single day. Your… pic.twitter.com/HhUvAKbIFH — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 1, 2023 -
భూమా, కోట్ల, కేఈ కుటుంబాల్లో గుబులు.. ఆజ్యం పోసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒక ప్రాంతంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటే మరో ప్రాంతంలో నేతలు నైరాశ్యంలో మునిగి తేలుతున్నారు. టీడీపీలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. సాక్షి, కర్నూలు: నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని టీడీపీ నేతల్లో నిస్తేజం నెలకొంది. కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం, అంతర్గత కలహాలను ప్రోత్సహించడంపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ కుమారుడు ఫిరోజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా వర్గపోరు నడుస్తోంది. ‘ఫిరోజ్ యువసేన’ పేరుతో సోషల్ మీడియాలో బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు. అసంతృప్తులకు ఆజ్యం పోసిన చంద్రబాబు.. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామని నేతల అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో టీడీపీలో కీలకంగా ఉండే భూమా, కోట్ల, కేఈ కుటుంబాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ భూమా అఖిలప్రియకు ఇస్తే, ఆ కుటుంబానికి రెండో అవకాశం ఇవ్వబోరని, నంద్యాలలో తాను రేసులో ఉండొచ్చని ఫిరోజ్ భావించారు. దీంతో ఇటీవల చురుగ్గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బ్రహ్మానందరెడ్డిపై విమర్శలు చేయిస్తున్నారు. భూమా వైఖరితోనే నంద్యాలలో టీడీపీకి ఈ దుస్థితి దాపురించిందని ప్రచారం చేయిస్తున్నారు. గత మునిసిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేయించారు. భూమా వర్గీయులు సైతం ఫిరోజ్ వర్గానికి వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ క్లస్టర్ మీటింగ్‌లో వేదికపైనే తనను సమావేశానికి ఆహ్వానించలేదని బ్రహ్మానందరెడ్డిపై ఫిరోజ్ అసంతృప్తి వెలిబుచ్చారు. దీనికి స్పందించిన భూమా.. టీడీపీలో విభేదాలు సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా ఎదుర్కొంటానన్నారు. ఎమ్మెల్సీ ఫరూక్ కనుసన్నల్లోనే ఫిరోజ్ వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కూడా ఇటీవల ఓ సందర్భంలో ‘‘పాలు అమ్ముకునేవారిని చంద్రబాబు ఎమ్మెల్యేను చేశారని’’ భూమా బ్రహ్మానందరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ‘భూమా’కు వ్యతిరేకంగా ఫరూక్ ఫ్యామిలీకి బీసీ సహకరిస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి సైతం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని చెబుతున్నారు. ముగ్గురు నేతల మధ్య విభేదాలు పెరిగిపోవడంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలో ఉండలేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కేఈ, కోట్ల కుటుంబాల్లోనూ టిక్కెట్ల గుబులు టీడీపీ ఆవిర్భావం నుంచి భూమా, కేఈ కుటుంబాలు జిల్లాలో అత్యంత కీలకంగా వ్యవహరించాయి. భూమా కుటుంబం టీడీపీ వీడిన తర్వాత కేఈ కుటుంబ పెత్తనం నడిచింది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పచ్చ కండువా వేసుకున్నారు. ఆపై భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు టీడీపీలో కీలకంగా ఉన్నాయి. కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ మూడు కుటుంబాల్లోనే గుబులు రేపుతున్నాయి. మాజీమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంట్లో ముగ్గురు నేతలు ఉన్నారు. కుమారుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ ఇన్చార్జ్గా ఉన్నారు. కేఈ సోదరుడు కేఈ ప్రతాప్ 2019లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. బేతంచెర్ల మునిసిపల్ ఎన్నికల సమయంలో కేఈ ప్రతాప్‌ని తప్పించి ధర్మవరం సుబ్బారెడ్డికి డోన్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్‌కు నియోజకవర్గం లేదు. దీంతో ఈయన ఆలూరు టిక్కెట్ కోసం యత్నిస్తున్నారు. ఆలూరు దక్కకపోతే కర్నూలు నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామంటే కోట్ల సుజాతమ్మతో పాటు కేఈ ప్రభాకర్‌కు కూడా టిక్కెట్ దక్కదు. దీంతో వీరంతా టీడీపీపై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉండగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎంపీ టిక్కెట్ కాదని, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు. కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చిన పార్టీని కాదని కోట్ల సుజాతమ్మ బయటకు రాలేరు. అయిష్టంగానైనా ఆమె టీడీపీలో కొనసాగనున్నారు. అయితే కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ మాత్రం టీడీపీ వీడి బయటకు రావాలనే యోచనలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఏడాది కిందట టీడీపీకి తాను రాజీనామా చేశానని కూడా కేఈ ప్రభాకర్ ప్రకటించారు. ఆపై అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా కర్నూలు, నంద్యాల జిల్లాలో టీడీపీ నేతలు కొందరు సరైన రాజకీయ ఫ్లాట్‌ఫాం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో ఉన్నారు. నేతల వర్గపోరు, అసంతృప్తుల మధ్య నలగలేక కార్యకర్తలు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
అదంతా కుదరదు.. అఖిలప్రియకు షాకిచ్చిన భూమా జగత్ విఖ్యాత్
దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబ భూముల వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల దగ్గర తన తల్లిపేరుపై ఉన్న స్థలంలో వాటా ఇప్పించాలని కోరుతూ నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాగా, తన పిటిషన్లో ప్రతివాదులుగా భూమా అఖిలప్రియ, మౌనికలతో పాటుగా భూమిని కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తుల పేర్లను చేర్చారు. వివరాల ప్రకారం.. 2016లో భూమా నాగిరెడ్డి.. తన భార్య శోభ చనిపోకముందు రాజేంద్రనగర్‌లో కొంత స్థలాన్ని విక్రయించారు. అయితే, ఆ స్థలాన్ని తాను మైనర్‌గా ఉన్నప్పుడు తన తండ్రి విక్రయించారని జగత్ విఖ్యాత్ తన పిటిషన్ పేర్కొన్నారు. తన తల్లి చనిపోయాక భూమిని విక్రయించారని.. ఈ క్రమంలో ఆ భూమి అమ్మకం చెల్లదంటూ పిటిషన్లో కోర్టుకు విన్నవించారు. భూమి అమ్మకం జరిగిన కొద్దిరోజుల తర్వాత నాగిరెడ్డి కూడా మరణించారు. ఇక, ఈ భూ వివాదంపై కింది కోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో జగత్ విఖ్యాత్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వాటా ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, భూమి అమ్మిన సమయంలో మేజర్లు అయిన తన ఇద్దరు కుమార్తెలతో పాటు నాగిరెడ్డి సంతకం చేశారు. అప్పటికి జగత్ విఖ్యాత్ మైనర్ కావడంతో తనతో వేలి ముద్ర వేయించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: విజయవాడ ఆర్టీసీ బస్సులో మహిళ ఓవరాక్షన్ -
భూమా కుటుంబ ఏకఛత్రాధిపత్యానికి చెక్
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సమీప బంధువు భూమా నారాయణరెడ్డి 25 సంవత్సరాలుగా చైర్మన్‌గా కొనసాగుతున్నారు. భూమా కుటుంబ పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. బుధవారం నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులయిన ముగ్గురు డైరెక్టర్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన ముగ్గురు డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు నలుగురు.. వైఎస్సార్సీపీ మద్దతు దారుడు ఎస్వీ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో విజయ పాల డెయిరీ చైర్మన్‌గా ఎస్వీ జగన్మోహన్రెడ్డి ఎన్నికైనట్లు డెయిరీ ఎండీ ప్రసాదరెడ్డి ప్రకటించారు. చదవండి: (మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు) -
సికింద్రాబాద్ కోర్టుకు అఖిలప్రియ!
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కేసులో కిడ్నాపర్లపై ఐపీసీ సెక్షన్ 448, 419, 341, 342, 506, 366 విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉండగా, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత వీరిని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి అఖిల ప్రియను బేగంపేట్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల నిర్వహించారు. కాసేపట్లో నిందితులను సికింద్రాబాద్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చదవండి: (బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: ఆ ముగ్గురు క్షేమం) నిందితులను అరెస్ట్ చేశాం: సీపీ అంజనీ కుమార్ కాగా, బోయిన్పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి సీపీ అంజనీ కుమార్ సాక్షితో మాట్లాడారు. 'కిడ్నాప్ కేసులో నిందితులను అరెస్ట్ చేశాము. ఈ కేసులో పూర్తి విచారణ కొనసాగుతంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. మాకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపైఅయితే అనుమానం వ్యక్తం చేశారో వారినే అదుపులోకి తీసుకున్నాం. కిడ్నాప్‌కి గురైన ముగ్గురు వ్యక్తులను కూడా సేఫ్‌గా తీసుకొచ్చాము. కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నాము' అని సీపీ అంజనీ కుమార్ వివరించారు. మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు. చదవండి: (భూమా ఫ్యామిలీకి ఎంత చెప్పినా వినలేదు) -
భూమా ఫ్యామిలీకి ఎంత చెప్పినా వినలేదు
సాక్షి, హైదరాబాద్ : బోయినపల్లి ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కేసుకు హఫీజ్‌పేటలోని 50 ఏకరాల భూవివాదమే కారణమని బాధితుల బంధువు ప్రతాప్ తెలిపారు. ఆ భూమికి సంబంధించి చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారని, ఆ భూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్‌లు అన్నీ ఉన్నాయని తెలిపారు. భూమా కుటుంబం, వాళ్ల పార్ట్నర్స్ మధ్య విభేదాలు కిడ్నాప్‌నకు దారి తీశాయని చెప్పారు. భూమా వర్గం వారి పార్ట్‌నర్స్‌తో తేల్చుకోవాలని చాలాసార్లు చెప్పామన్నారు. భూ వివాదంలో వాళ్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రెండేళ్ల క్రితమే తమని సంప్రదించారని, అప్పుడే అన్ని డాక్యుమెంట్లు చూపించామన్నారు. అయినప్పటికి భూమా కుటుంబం మళ్లీ తమ మీదకే వివాదానికి వచ్చిందని తెలిపారు. తాము పోలీసులకు చెప్పిన అనుమానితుల్నే కిడ్నాపర్లుగా తేల్చారన్నారు. (బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: ఆ ముగ్గురు క్షేమం) కాగా, మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు. -
‘జగత్’ కంత్రీలు.. వెలుగులోకి 'భూమా'య..
ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే వారే కబ్జాదారుడికి అండగా నిలిచారు. పీర్ల మాన్యం ఆక్రమణలో తమ వంతు పాత్ర పోషించారు. ఆక్రమిత స్థలంలో డెయిరీ నిర్మాణాన్ని సైతం చేపట్టారు. బాధిత ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ‘భూ మా’య విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. సాక్షి, నంద్యాల: ఆళ్లగడ్డ పట్టణంలోని సర్వే నం. 67లో 6.40 ఎకరాల పీర్ల మాన్యం భూమి ఉంది. దీన్ని ముల్లా మక్తుమ్ సాహెబ్ వారసులు అనుభవించేవారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో పీర్ల చావిడి సేవలు, పండుగలు ఘనంగా జరిపేవారు. అయితే ఈ భూమిపై భూమా అఖిలప్రియ అనుచరుడు కోతమిషన్ షరీఫ్ కన్ను పడింది. ముల్లా కుటుంబ సభ్యులను భయపెట్టి మాన్యాన్ని కబ్జా చేశారు. ఈ భూమిని తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ఇళ్లను నిర్మించారు. వీటిని కొంత మందికి అమ్మేశారు. మరికొంత స్థలంలో భూమా కుటుంబ సభ్యులు జగత్ డెయిరీని నిర్మించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని 67 సర్వే నంబరులో రికార్డుల ప్రకారం ఏయే నిర్మాణాలు ఉన్నాయో తెలపాలని ముల్లా కుటుంబం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సర్వే నంబరులో ఇళ్లు, జగత్ డెయిరీ, బీబీఆర్ స్టేడియం, షాదీఖానా, రోడ్లు, జగత్ డెయిరీ ఫార్మా నిర్మాణాలు ఉన్నాయని, 4.50 ఎకరాలు ఖాళీ స్థలం ఉందని ఆళ్లగడ్డ తహసీల్దార్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మాన్యం భూమిలో 0.66సెంట్లు ఆక్రమించి జగత్ డెయిరీ ఫార్మా నిర్మించినట్లు తేలింది. పీర్ల మాన్యం మొత్తం ఆక్రమణలో ఉన్నా.. రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ భూమా అఖిలప్రియ సైతం నోరుమెదపడం లేదు. (అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?) ముస్లింలకు న్యాయం చేయాలి భూమా అఖిలప్రియ మాటలు, చేష్టలు వేర్వేరుగా ఉన్నాయి. ముస్లింలపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నట్లు మాట్లాడుతారు. ఆళ్లగడ్డలో మాత్రం ముస్లింలకు చెందిన భూములను ఆక్రమించుకొని, అందులో కట్టడాలు నిర్మిస్తారు. ఆళ్లగడ్డలో పీర్ల మాన్యం ఆక్రమించుకున్న వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని ముస్లింలకు న్యాయం చేయాలి. – శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు.. పీర్ల మాన్యం ఆక్రమణకు గురైందని, తమకు న్యాయం చేయాలని ముల్లా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని కోరారు. ముల్లా కుటుంబీకులతో కలిసి ఇరువురు ఎమ్మెల్యేలు గురువారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు వినతి పత్రం అందించారు. పీర్ల మాన్యాన్ని భూమా అనుచరుడు ఆక్రమించడంతో ఆదాయం కోల్పోయి పీర్ల పండుగ ఘనంగా నిర్వహించలేకపోతున్నామని ముల్లా వంశస్తులు మహబూబ్‌బాషా, గౌస్‌మొద్దీన్, ముక్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేనెంబరు 67లో ఉన్న 6.40 ఎకరాల పీర్ల మాన్యం తమకు అప్పగించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) విచారణ జరపండి.. ఆళ్లగడ్డ పట్టణంలోని పీర్ల మాన్యం ఆక్రమణ విషయంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెంటనే స్పందించారు. ఆళ్లగడ్డ తహసీల్దార్‌కు ఫోన్ చేసి, రికార్డులను పరిశీలించి విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఇన్చార్జ్ భూమా అఖిల ప్రియ సైతం నోరు మెదపడం లేదు ముస్లింల మాన్యం భూమిని ఆక్రమించుకొని అందులో జగత్ డెయిరీని నిర్మించుకున్న భూమా అఖిలప్రియకు ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదు. ముస్లింలపై మీకు నిజంగా ప్రేమ, అభిమానం ఉంటే పీర్ల మాన్యంలో నిర్మించుకున్న కట్టడాలను తీసివేసి స్థలం వారికి ఇవ్వాలి. ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేశారు. భూమా కుటుంబ సభ్యులు మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారు. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే -
నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి
సాక్షి, నంద్యాల: ‘నిన్ను చంపితే కాని మాకు చైర్మన్ పోస్టు రాదు’ అని విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డిని భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం నంద్యాల తాలూకా పోలీసులు ఐపీసీ 448, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాలూకా సీఐ దివాకర్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. విజయ డెయిరీ పాలక మండలి సమావేశం గత నెల 28వ తేదీన జరగగా డైరెక్టర్లను మాట్లాడాలని పిలిపించుకొని భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ ఆళ్లగడ్డలో ఉంచుకున్నారు. ముగ్గురు డైరెక్టర్లు ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో 28వ తేదీ జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నామని విజయడెయిరీ చైర్మన్ ఎండీ ప్రసాదరెడ్డి డైరెక్టర్లకు సమాచారం అందించారు. డైరెక్టర్లు కొందరు మంత్రాలయం, కర్నూలులోని పలు ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. డైరెక్టర్లు వెళ్లిన చోట జగత్‌విఖ్యాత్ రెడ్డి మనుషులు కనిపించడంతో తిరిగి వారు రైతునగరం గ్రామంలోని భూమా నారాయణరెడ్డి నివాసానికి వచ్చారు. విషయం తెలుసుకున్న భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్, రవి తమ అనుచరులతో కలిసి వాహనాల్లో నారాయణరెడ్డి ఇంటి వద్దకు 1వ తేదీ రాత్రి 11.20గంటలకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ‘నిన్ను చంపితే గాని చైర్మన్ పదవి మాకు రాదు అంటూ’ భూమా నారాయణ రెడ్డిని హెచ్చరించారు. దీంతో మంగళవారం బాధితుడు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
భూమా కుటుంబంలో ‘డెయిరీ’ చిచ్చు
నంద్యాల: భూమా కుటుంబంలో విభేదాలు రచ్చ కెక్కాయి. విజయ డెయిరీ చైర్మన్ పదవి కోసం మాజీ ఎంపీ, దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పట్టుబడుతున్నారు. చైర్మన్‌గా ఉన్న భూమా నారాయణరెడ్డి ఇందుకు అంగీకరించడం లేదు. ఈ పదవి గత 25 సంవత్సరాలుగా భూమా కుటుంబం చేతిలోనే ఉంది. ఐదురోజుల క్రితం విజయ డెయిరీ సమావేశం జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. ముగ్గురు డైరెక్టర్లను భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఆయన బావ(మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త)భార్గవర్ధన్ ఆళ్లగడ్డలో బలవంతంగా ఉంచారు. దీంతో వారు రాకపోవడంతో కోరం లేక సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి ఈనెల 2వ తేదీ సోమవారం పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. (చదవండి: రాజధాని పేరిట చంద్రబాబు బినామీ ఉద్యమం) ఈ నేపథ్యంలో సమావేశం వాయిదా పడకూడదని, విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి కొంత మంది డైరెక్టర్లను నంద్యాల శివారులోని రైతునగరంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, భార్గవర్ధన్ నాయుడు ఆదివారం రాత్రి డైరెక్టర్లు ఉన్న రైతునగరానికి వెళ్లి భూమా నారాయణరెడ్డితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నంద్యాల తాలూకా సీఐ దివాకర్‌రెడ్డి తన సిబ్బందితో రైతునగరానికి ఆదివారం రాత్రి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ క్రమంలో విజయ డెయిరీ పాలక మండలి సమావేశం సోమవారం పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగింది. ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 50 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశానికి 11 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. (చదవండి: బీసీలంతా వైఎస్ జగన్‌కు రుణపడ్డాం: జయరాం) మనవడి పోస్టు పోయింది భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి నా మనవడు. నిన్న భార్గవర్ధన్తో కలిసి నా ఇంటి వద్దకు వచ్చినప్పుడే మనవడి పోస్టు పోయింది. చైర్మన్ పదవి అందరితో కూర్చొని మాట్లాడి తీసుకోవాలే కాని, నేను రాజీనామా చేస్తే వారికి వస్తాదనేది వారి భ్రమ. – భూమా నారాయణరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ -
'అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకున్నాం'
కర్నూలు: తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం అంటే ఈ రోజుతో ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిరువురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు. భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అధికార తెలుగుదేశం పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి నిలపలేదు. అదికాక స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కూడా తమ నామినేషన్ ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అభ్యర్థి, భూమా శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.