
దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబ భూముల వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల దగ్గర తన తల్లిపేరుపై ఉన్న స్థలంలో వాటా ఇప్పించాలని కోరుతూ నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాగా, తన పిటిషన్‌లో ప్రతివాదులుగా భూమా అఖిలప్రియ, మౌనికలతో పాటుగా భూమిని కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తుల పేర్లను చేర్చారు.
వివరాల ప్రకారం.. 2016లో భూమా నాగిరెడ్డి.. తన భార్య శోభ చనిపోకముందు రాజేంద్రనగర్‌లో కొంత స్థలాన్ని విక్రయించారు. అయితే, ఆ స్థలాన్ని తాను మైనర్‌గా ఉన్నప్పుడు తన తండ్రి విక్రయించారని జగత్ విఖ్యాత్ తన పిటిషన్ పేర్కొన్నారు. తన తల్లి చనిపోయాక భూమిని విక్రయించారని.. ఈ క్రమంలో ఆ భూమి అమ్మకం చెల్లదంటూ పిటిషన్‌లో కోర్టుకు విన్నవించారు. భూమి అమ్మకం జరిగిన కొద్దిరోజుల తర్వాత నాగిరెడ్డి కూడా మరణించారు.
ఇక, ఈ భూ వివాదంపై కింది కోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో జగత్ విఖ్యాత్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వాటా ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, భూమి అమ్మిన సమయంలో మేజర్లు అయిన తన ఇద్దరు కుమార్తెలతో పాటు నాగిరెడ్డి సంతకం చేశారు. అప్పటికి జగత్ విఖ్యాత్ మైనర్ కావడంతో తనతో వేలి ముద్ర వేయించారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: విజయవాడ ఆర్టీసీ బస్సులో మహిళ ఓవరాక్షన్
Comments
Please login to add a commentAdd a comment