
ఆళ్లగడ్డ(నంద్యాల): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు శనివారం హౌస్ అరెస్టు చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, నంద్యాల గాంధీ చౌక్‌కు వచ్చి వాటిని బయటపెడతానని, తమపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కూడా ఆధారాలతో రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు.
ఈ మేరకు శనివారం ఉదయం ఆమె ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తన సిబ్బందితో అఖిలప్రియ ఇంటికి వెళ్లి హౌస్ అరెస్టు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment