ఘటన స్థలంలో మృతి చెందిన ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, మృతి చెందిన శ్రీనివాసరెడ్డి (ఫైల్)
సాక్షి, ఆళ్లగడ్డ : నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇందూరు ప్రభాకరరెడ్డి, ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరు ఆళ్లగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డికి ముఖ్య అనుచరులు. హంతకులు.. మంత్రి అఖిలప్రియకు ముఖ్యులు.
∙2018 అక్టోబర్‌లో బాలయ్య అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు అహోబిలంలో దాడులకు పాల్పడ్డారు. అంతేగాక అడ్డుబోయిన కానిస్టేబుల్ నాగిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు.
2019న ఫిబ్రవరి 12న ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన దళిత మహిళను మంత్రి అఖిలప్రియ ప్రధాన అనుచరుడు (అంగరక్షకుడు) సి.శ్రీనివాసులు లైంగికంగా వేధిస్తుండంతో అవమాన భారంతో పాటు భయంతో ఆ మహిళ గ్రామం వదిలి పుట్టింటికి వెళ్లింది. భార్య ఇళ్లు వదలి వెళ్లి పోవడంతో పాటు ఈవిషయం గ్రామంలో చర్చనీయాంశం కావడంతో అవమాన భారంతో ఆ మహిళ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.
- అలాగే మంత్రి అనుచరులు 2019 డిశంబర్‌లో ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన దివ్యాంగుడైన దస్తగిరిని మోటారు బైక్ అడ్డువచ్చిందనే నెపంతో దారుణంగా కొట్టారు.
పోలీసుల అండతో అక్రమ కేసులు
- 2015 మార్చి 21న జిల్లాలోని కృష్ణగిరి మండల పరిధిలోని బోయబొంతిరాళ్ల గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. అయితే అధికారపార్టీ పోలీసుల అండతో ప్రతిపక్షం వారు పెట్టిన కేసును ఫాల్స్ కేసుగా చేశారు. కాని వైఎస్సార్‌సీపీ వారిపై మాత్రం సెక్షన్–307కేసు నమోదు చేయడంలోనే కోర్టులో నడుస్తోంది.
- కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్. ఎర్రగుడి గ్రామంలో గతేడాది జూలై 13న దళితులకు సంబంధించి బావి వద్ద అక్రమం నిర్మాణాలను తొలగించే విషయంలో టీడీపీ జెండా కట్టాను తీసేయాలని చూసారని వైఎస్సార్‌సీపీ నాయకులు మాదన్నతోపాటు మరో ఐదుగురుపై అధికారపార్టీ నాయకులు కేసు నమోదు చేయించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు తమను కులం పేరుతో దూషించారని కేసు ఇచ్చేందుకు వెళ్లితో పోలీసులు పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.
- కొలిమిగుండ్ల మండలం మదనంతపురంలో వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులు తమ పొలం మీదుగా వెళ్లేందుకు రస్తా ఇవ్వలేదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. చిన్న రామాంజనేయులు, రాజి, భవాణిపై టీడీపీ నాయకులు కొండారెడ్డి, మల్లేశ్వరరెడ్డి,శివారెడ్డి పొలం వద్దే దాడికి పాల్పడ్డారు. ఇంటికొచ్చాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా మరో సారి దాడికి తెగబడ్డారు. బాధితులు ఫిర్యాదు చేసినా.. చివరకు పోలీసులు వారి పైనే కేసు నమోదు చేసి టీడీపీ నాయకులపై కేసు లేకుండా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment