ఆళ్లగడ్డలో జోరందుకున్న చేరికలు | Many People Joined  YSR Congress Party Under The Guidance Of MLC Gangulala Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డలో జోరందుకున్న చేరికలు

Published Fri, Mar 15 2019 9:14 AM | Last Updated on Fri, Mar 15 2019 9:14 AM

Many People Joined  YSR Congress Party Under The Guidance Of MLC Gangulala Prabhakar Reddy - Sakshi

గంగుల సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్న నరసాపురం గ్రామ టీడీపీ నాయకులు

సాక్షి, ఆళ్లగడ్డ: వైఎస్‌ఆర్‌సీపీలోకి వలసలు జోరందుకున్నాయి.  ఆళ్లగడ్డ నియోజకవర్గంలో   భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు.  గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో  మంత్రి అఖిలప్రియ  ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వలసలను ఆపేందుకు స్వయంగా ఫోను చేసి మాట్లాడటంతో  పాటు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి బుజ్జగిస్తున్నారు. వినని వారి ఇంటికి పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నా వారు బెదరకుండా వైఎస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకుంటున్నారు.  ఒకటి రెండు రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

తాజాగా గురువారం మంత్రి అఖిలప్రియ సమీప బంధువు, అత్యంత ఆప్తుడు రుద్రవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన  అంబటి మహేశ్‌రెడ్డి వర్గానికి చెందిన నంద్యాల శివారెడ్డి, సంజీవరెడ్డి, బాలిరెడ్డి, మోహన్‌రెడ్డి, సోముల వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, శౌరెడ్డి, చంద్రమౌలి, పంగా సుబ్బరాయుడు, మేకలమాబు తదితరులు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ నాయకుడు నాని ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రసాదరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, నాగరాజు, సుద్దుల కిట్టు తదితరులున్నారు.
   
మంత్రికి ఝలక్‌... వైఎస్‌ఆర్‌సీపీలోకి సింగం  
మంత్రి అఖిప్రియకు అత్యంత ఆప్తుడు, పట్టణ టీడీపీ నాయకుడు, నగరం పంచాయతీ కో ఆప్షన్‌ కౌన్సిలర్‌  సింగం వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం గంగుల ప్రభాకర్‌రెడ్డి, నానీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరి చేరికతో నియోజకవర్గంలో  పార్టీ మరింత బలోపేతమైంది.  కార్యక్రమంలో నాయకులు గంధం రాఘవరెడ్డి, గజ్జల రాఘవేంద్రారెడ్డి, శివనాగిరెడ్డి, నాసారి వెంకటే శ్వర్లు, నరసింహారెడ్డి తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement