
వైఎస్సార్‌సీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి(పాత చిత్రం)
కర్నూలు జిల్లా: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిపై వైఎస్సార్‌సీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. మంత్రి అఖిల ప్రియా తమ్ముడు జగత్ విఖ్యాత్ టీడీపీ కండువా వేసుకుని, వాహనం మీద స్టిక్కర్ వేసుకుని పోలింగ్ బూతులోకి వెళ్తున్నా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్లు వేసే సమయంలో అఖిల ప్రియ ఫోటో స్టికర్ ఓటర్లకు పంపించి ఓట్లు టీడీపీకి వేసిన తర్వాత రూ.2 వేలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు.
ఎలక్షన్ కమీషన్ సరిగ్గా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించలేదని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ఎంతగానో ప్రయత్నించారని ఆరోపించారు. ఆళ్లగడ్డ అభివృద్ధిలో పోటీ పడతాం తప్ప, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వమని గంగుల ప్రభాకర్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు.