
రుద్రావరం మండలంలో మంత్రి అఖిలప్రియ పర్యటన
సాక్షి, ఆళ్లగడ్డ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానంటూ పోలీసులను హెచ్చరించారు. పోలీసులు కక్ష కట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. (అలిగిన మంత్రి అఖిలప్రియ)
తన సొంత అనుయాయులపై పీడీ చట్టం ప్రయోగించారని, కార్డాన్ సర్చ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతను కాదన్నారు. సొంత సెక్యూరిటీతోనే మావోయిస్టుల ప్రభావం ఉన్న కర్నూలు జిల్లా రుద్రావరం మండలంలో మంత్రి అఖిలప్రియ పర్యటించారు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment