కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే.