పార్టీలో చేరిన గుండుపాపల, కొత్తపల్లె గ్రామస్తులతో ఎమ్మెల్సీ గంగుల
సాక్షి, ఆళ్లగడ్డ: ఐదేళ్ల పాటు అక్రమాలు, అవినీతి, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీకి పతనం ప్రారంభమైందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బుధవారం దొర్నిపాడు మండలంలోని గుండుపాల గ్రామంలో మండల గోపవరం అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ డైరెక్టర్ బండి శ్రీనివాసరెడ్డి, మల్లు సూర్యనారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, లింగాల సూర్యనారాయణరెడ్డి, రామిరెడ్డి, రామసుబ్బారెడ్డి, శ్రీరాములు, అబ్రహాం, ప్రసాద్‌రెడ్డి, స్వామిదాసు, వెంకటేశ్వర్లు తదితరులతో పాటు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు.
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. అనంతరం ఉయ్యాలవాడ మండలం అల్లూరు మజరా అయిన కొత్తపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అరికట్ల శివరామకృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, నారాయణరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, సాలయ్య, కులశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో 20 కుటుంబాలు పార్టీలో చేరారు. షేక్ ఉసేన్‌బాషా, ఇమాం, హుసేన్‌వలి, మౌలాలి, మాబు, కరీం, నాగేశ్వరరావు, బడేసా, పెద్దయ్య, నాగరాజు తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు కూలురు నరసింహారెడ్డి, నారయణరెడ్డి, రాజారెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment