GANGULA Prabhakar Reddy
-
టీడీపీకి షాకిచ్చిన నేతలు
సాక్షి, ఆళ్లగడ్డ: ఐదేళ్ల పాటు అక్రమాలు, అవినీతి, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీకి పతనం ప్రారంభమైందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బుధవారం దొర్నిపాడు మండలంలోని గుండుపాల గ్రామంలో మండల గోపవరం అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ డైరెక్టర్ బండి శ్రీనివాసరెడ్డి, మల్లు సూర్యనారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, లింగాల సూర్యనారాయణరెడ్డి, రామిరెడ్డి, రామసుబ్బారెడ్డి, శ్రీరాములు, అబ్రహాం, ప్రసాద్‌రెడ్డి, స్వామిదాసు, వెంకటేశ్వర్లు తదితరులతో పాటు 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. అనంతరం ఉయ్యాలవాడ మండలం అల్లూరు మజరా అయిన కొత్తపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అరికట్ల శివరామకృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, నారాయణరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, సాలయ్య, కులశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో 20 కుటుంబాలు పార్టీలో చేరారు. షేక్ ఉసేన్‌బాషా, ఇమాం, హుసేన్‌వలి, మౌలాలి, మాబు, కరీం, నాగేశ్వరరావు, బడేసా, పెద్దయ్య, నాగరాజు తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు కూలురు నరసింహారెడ్డి, నారయణరెడ్డి, రాజారెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలంతా గమనిస్తున్నారు
చాగలమర్రి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరు చిత్తశుద్ధితో పోరాడుతున్నారో... ఎవరు పూటకో మాట మారుస్తున్నారో ప్రజలు అంతా గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాబులాల్, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చాగలమర్రిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్సీ, పార్టీ నియోజకవర్గ నేత గంగుల నాని పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ప్రత్యేక హాదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని నేటికీ పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక హాదా వద్దని ప్యాకేజీయే ముద్దని మొన్నటి వరకు ప్రకటించారు. హోదా కావాలని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేస్తే వారిని జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బీజేపీతో కొన్ని విషయాల్లో సర్దుబాటు గాక హోదాపై యూ టర్న్ తీసుకొని ప్రస్తుతం హోదా ఉద్యమాన్ని తామే భుజాన వేసుకొని మోస్తున్నామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీతో అన్నీ వస్తాయని ఆనాడు బీజేపీ నాయకులకు సన్మానం చేయలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక ప్యాకేజీని మెచ్చుకున్న చంద్రబాబు..నేడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదరణ పెరుగుతుండటంతో హోదా పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే వారికి సహకరించకుండా, నేడు అవిశ్వాసం పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. చివరికి ప్రధానమంత్రి కూడా మీరడిగితేనే ప్యాకేజీ ఇచ్చామని, ఇప్పుడు పరిస్థితుల ప్రభావమంటూ మాట మారిస్తే ఎలా అన్నారన్నారు. రాష్ట్రం పురోభివృద్ధి చెందాలంటే వైఎస్.జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 24వ తేదీన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మాబుషరీఫ్, ఉపసర్పంచ్ అబ్దుల్లాబాషా, నాయకులు శింగం భరత్‌కుమార్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, కొలిమి హుసేన్‌వలి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీరు–చెట్టు అవినీతిమయం
చాగలమర్రి: టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న నీరు–చెట్టు కార్యక్రమం అవినీతిమయమైందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కొలిమి హుసేన్‌వలి కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీరు – చెట్టు కార్యక్రమం వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని కేవలం ఆ పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికే అమలు చేస్తున్నారన్నారు. అవసరం లేని పనులు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశౠరు. ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక రైల్వేజోన్ నాలుగేళ్ల కిందట ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మోసం చేయడానికే దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. దొంగ దీక్షలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కర్నూలును దేశ రెండో రాజధానిగా చేయాలని మంత్రి లోకేష్ కోరడం బాగానే ఉందని, మీరెందుకు కర్నూలలో హైకోర్టు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబులాల్, మండల కన్వీనర్ కుమార్‌రెడ్డి, ఉపసర్పంచ్ అబ్దుల్లాబాషా, ఎంపీటీసీ సభ్యుడు మాబుషరీఫ్, తోడేండ్లపల్లె సర్పంచ్ వీరభద్రుడు, నాయకులు శివనాగిరెడ్డి, సింగంభరత్ రెడ్డి, గేట్లమాబు, ముల్లారఫి, ముల్లా ఇబ్రహీ, షబ్బీర్, ఫయాజ్, శేషు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి -
అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు
సాక్షి, ఆళ్లగడ్డ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్దానికి ప్రతిరూపమని, ఆయన నోటి వెంట ఒక్క నిజం కూడా బయటకు రాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేత రాంమాధవ్ ఇంటికి పోయినట్లు చిన్న ఆధారంతో నిరూపించినా దేనికైనా సిద్ధమని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రాజకీయాల్లో వ్యక్తిగత మిత్రులు ఎంతో మంది ఉంటారని, వారు ఎదురుపడినప్పుడు కలసి మాట్లాడుకుని యోగక్షేమాలు తెలుసుకోవడం సహజమన్నారు. అలాంటిది ఇతర పార్టీ వాళ్లతో మాట్లాడితే రాజకీయ సంబంధం అంటగట్టడం సీఎంకే చెల్లిందన్నారు. ఆయనలో అభద్రతా భావం రోజురోజుకు పెరిగి ఎదుటివారిపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, దేశంలో అందరికంటే తానే సీనియర్ అని చెప్పుకునే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. నాలుగేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్ర ప్రజలు తమ వెంటరావాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకుడు నయాబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
ఉయ్యాలవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన ఉయ్యాలవాడలో పర్యటించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. హామీలను విస్మరించిన సీఎంకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కంది, మినుము పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నా ఆదుకునే దిక్కు లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్న పథకాలు ప్రకటించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది తమ పార్టీ ఒక్కటేనన్నారు. కుందూలో చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆళ్లగడ్డ ఇన్చార్జ్ గంగుల బిజేంద్రారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, బుడ్డా ఈశ్వరరెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి గంగుల
⇒ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్ ⇒ పెద్ద సంఖ్యలో చేరిన నాయకులు, కార్యకర్తలు సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గంగుల ప్రభాకర్‌రెడ్డి, తనయుడు గంగుల బిజేంద్రరెడ్డి(నాని)తో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గంగుల మనోహర్‌రెడ్డి, గంగుల సుభాష్‌రెడ్డి, గంగుల నాని, జెడ్పీటీసీ కో–ఆప్షన్ మెంబరు షేక్‌బాబులాల్, తిరువెళ్ల జెడ్పీటీసీ నజీర్, రుద్రవరం జెడ్పీటీసీ వెంకటరమణమ్మ, ఆళ్లగడ్డ ఎంపీపీ బండి చంద్రుడు, ఆళ్లగడ్డ కౌన్సిలర్లు అఫ్జల్, ఎస్. శ్రీదేవి, నీటి సంఘం డీసీ సభ్యుడు జాఫర్ రెడ్డి, జి. రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారు : గంగుల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానాలను నమ్మి ఎన్నుకున్న ప్రజలను మోసం చేశారని ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలను, పార్టీ నాయకుల ను మోసగించడం ఆయనకు అలవాటేనని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గంగుల మనోహర్‌రెడ్డి, గంగుల సుభాష్‌రెడ్డి, గంగుల బిజేంద్రరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ మెంబరు బాబులాల్‌లతో కలసి మాట్లాడారు. వైఎస్సార్సీపీలో చేరడం పట్ల చాలా ఆనందంగా ఉందని గంగుల తెలిపారు. వైఎస్సార్సీపీలో చేరదామని, జగన్ నాయకత్వాన్ని బలపరుద్దామని తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలంతా ముక్తకంఠంతో చెప్పారని ఆయన అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవకర్గంలో 35 ఎంపీ టీసీలు, ముగ్గురు ఎంపీపీలు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు కౌన్సిలర్లు, 53 నీటి సంఘాల అధ్యక్షుల్లో 50 మంది అధ్యక్షులు, 37 మంది çసర్పంచులను గెలిపించుకున్నానని చెప్పారు. త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన వారందరినీ వైఎస్సార్సీపీలో చేర్చుతామని చెప్పారు. గతంలో భూమా నాగిరెడ్డి అనే విషపు మొక్కను నాటానని 2012 ఎన్నికల్లో చంద్రబాబే చెప్పి బహిరంగంగా క్షమించమని కోరారని చెప్పారు. ఇవాళ ఆ విష వృక్షాన్నే చంద్రబాబు కౌగిలించుకుంటున్నారని ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మంత్రి పదవే కాదు.. చివరికి చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వొచ్చేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. త్వరలోనే సమీకరణలు జరుగుతాయని గంగుల అన్నారు. గత డిసెంబర్లో వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారని, అక్కడ అసంతృప్తితో తాను వచ్చిన విధంగానే వాళ్లంతా కూడా రావచ్చన్న అభిప్రాయాన్ని ప్రభాకర్‌రెడ్డి వ్యక్తం చేశారు.