చాగలమర్రి: టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న నీరు–చెట్టు కార్యక్రమం అవినీతిమయమైందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కొలిమి హుసేన్‌వలి కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీరు – చెట్టు కార్యక్రమం వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని కేవలం ఆ పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికే అమలు చేస్తున్నారన్నారు. అవసరం లేని పనులు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశౠరు. ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక రైల్వేజోన్ నాలుగేళ్ల కిందట ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మోసం చేయడానికే దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.
దొంగ దీక్షలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కర్నూలును దేశ రెండో రాజధానిగా చేయాలని మంత్రి లోకేష్ కోరడం బాగానే ఉందని, మీరెందుకు కర్నూలలో హైకోర్టు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబులాల్, మండల కన్వీనర్ కుమార్‌రెడ్డి, ఉపసర్పంచ్ అబ్దుల్లాబాషా, ఎంపీటీసీ సభ్యుడు మాబుషరీఫ్, తోడేండ్లపల్లె సర్పంచ్ వీరభద్రుడు, నాయకులు శివనాగిరెడ్డి, సింగంభరత్ రెడ్డి, గేట్లమాబు, ముల్లారఫి, ముల్లా ఇబ్రహీ, షబ్బీర్, ఫయాజ్, శేషు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment