
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి
ఉయ్యాలవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన ఉయ్యాలవాడలో పర్యటించారు. అనంతరం వైఎస్‌ఆర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. హామీలను విస్మరించిన సీఎంకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కంది, మినుము పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నా ఆదుకునే దిక్కు లేదన్నారు.
రైతుల సంక్షేమం కోసం తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్న పథకాలు ప్రకటించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది తమ పార్టీ ఒక్కటేనన్నారు. కుందూలో చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్ గంగుల బిజేంద్రారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, బుడ్డా ఈశ్వరరెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment